సృష్టి మూలానికి ఆడ, మగ కలయిక ప్రధాన కారణం. అయితే.. ఇది సహజ సిద్ధంగా జరగాల్సిన వయసులో జరిగితేనే మంచింది. అలా కాదని ఈ విషయంలో ప్రయోగాలకి పోతే లేని పోనీ కష్టాలు ఎదురవుతాయి. నిజానికి మనిషి జీవితంలో ఆకలి, దప్పిక ఎంత ముఖ్యమో ఈ శారీరిక సుఖం కూడా అంతే ముఖ్యం. ఇది మనిషి జీవితంలో ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ఉత్సాహం ఇస్తుంది. అయితే.. 50 నుంచి 60 ఏళ్లు దాటాక.. ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఊహించుకోండి. పలానా వయస్సు వచ్చాక.. మనిషికి శక్తి తగ్గుతుంది కనుక అందుకు తగ్గట్టే నడుచుకోవాలి. కాదు.. నేనేంటో ఈ వయస్సులో కూడా నిరూపించుకోవాలి అనుకుంటే.. ఇదిగో ఈ పెద్దాయన లాగా అవుతారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: పదేపదే పుట్టింటికి వెళ్తున్న భార్య.. ఎంచక్కా ప్రియుడితోనే ఉంటూ!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి తన భార్యతో శారీరికంగా కలిశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. అయితే.. ఏం జరిగిందో తెలియదు కానీ, కాసేపటికే గజినీలా మారిపోయి గతం మర్చిపోయాడు. అందుకని చిన్నతనం నుంచి జరిగిన ఘటనలన్నీ మర్చిపోలేదు. సరిగ్గా అంతకు రెండు రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు. ఆ రెండు రోజుల్లో తన పెళ్లి రోజు కూడా ఉండడంతో సెలబ్రేట్ చేసుకోలేదని చాలా బాధ పడిపోయాడు. భార్యకు ఏడుస్తూ క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘లేదు.. లేదు మనం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం’’ అని ఆమె ఎంత చెప్పినా నమ్మలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటూ భార్యాపిల్లలను పదే పదే అడుగుతూ విసిగించాడు. ఈ ఘటన ఐర్లాండ్‌లోని లైమ్‌రిక్ ప్రాంతంలో వెలుగు చూసింది.
దీనిపై నిపుణులు మాట్లాడుతూ.. అతని సమస్యను టీజీఏ (ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా) అని చెప్పారు. కొన్నిసార్లు శారీరకంగా తీవ్రమైన శ్రమ చేసినప్పుడు గతంలో జరిగిన ఘటనలను మర్చిపోతారని, దీని వల్ల పెద్దగా సమస్యలు ఉండవని చెప్పారు. అయితే బాధితులు, వాళ్ల కుటుంబ సభ్యులు డిప్రెషన్‌కు గురవుతారని తెలిపారు. టీజీఏతో బాధపడే వారికి సడెన్‌గా మెమొరీలో కొంత భాగం మాయమైపోతుందని, కొన్ని గంటల తర్వాత మళ్లీ అవి గుర్తుకొచ్చే అవకాశం ఉందని వివరించారు. సదరు ఐర్లాండ్ పౌరుడికి కూడా భార్యాపిల్లలతో మాట్లాడిన తర్వాత కొన్ని గంటలకు అన్నీ గుర్తొచ్చాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: నా భార్య కంట్లో కారంపోసి కొడుతోంది.. ప్లీజ్ కాపాడండంటూ పోలీసులను వేడుకున్న భర్త!