ఇరాన్ లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అయితే ఈ చట్టాలపై అక్కడి పౌరులు గత కొన్నేళ్ల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయని అక్కడి ప్రజలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా తాజాగా మరో ముగ్గురు మహిళలకు ఉరి శిక్ష విధిస్తూ ఉరి తీశారు. ఉరి తీసేలా అంతలా ఆ మహిళలు చేసిన దారుణం ఏంటనే కదా మీ ప్రశ్న. అసలేం జరిగిందంటే? చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, పెళ్లయ్యాక గృహ హింస వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో కొందరు భర్తలు విడాకులు తీసుకోవాలని వేధించడంతో ఇలా కొంత మంది మహిళలు భర్త టార్చర్ ను భరించలేకపోతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా కట్టుకున్న వాడిని హత్య చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ముగ్గురు మహిళలు భర్తలను హత్య చేశారు. వీరి హత్యలపై స్పందించిన అక్కడి ప్రభుత్వం వీరికి కఠిన శిక్ష అమలు చేసింది. ఇలా బరితెగించి భర్తలను హత్యచేయడం ఏంటని అక్కడి చట్టం ప్రకారం అధికారులు ఈ నెల 27న ఆ ముగ్గురి మహిళలకు ఉరి శిక్షవిధించారు. మహిళలను ఉరి తీయడం ఏంటని అక్కడి ప్రజలు, మహిళలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశం దేశ వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇలా మహిళలను ఉరి తీసేలా ఉన్న ఇరాన్ చట్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య