ఇప్పటికే జనజీవితాలను కకావికలం చేసిన కరోనా మహ్మమారి మళ్లీ తన విషపు పంజా విసరబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్‌లతో కొన్ని లక్షల మందిని బలితీసుకుంది. తాజాగా తన పుట్టినిల్లు చైనాలో మళ్లీ తన ప్రతాపం చూపిస్తుంది. ప్రపంచ దేశాలకు హెచ్చరిక థర్డ్‌వేవ్ హెచ్చరిక జారీ చేస్తోంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కట్టడి చర్యల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం అనేక నిర్ణయాలను ప్రకటించింది. వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది, స్కూళ్లను మూసివేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలను కూడా పెద్ద సంఖ్యలో పెంచింది. చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది.
చైనాకు వచ్చే చాలా మంది పర్యాటకులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్, గాన్సు ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాలో పర్యటించారు. ఈ క్రమంలో రాజధాని బీజింగ్ సహా ఐదు ప్రావిన్స్‌ల్లో పెద్దఎత్తున ప్రజలతో కాంటాక్టు అయినట్లు భావించి చైనా చర్యలు చేపట్టింది. విహార కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను మూసివేసి స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. గ్జియాన్, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసులను రద్దు చేసిన అధికారులు.. ఇన్నర్ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు. కరోనా ప్రభావం బొగ్గు దిగుమతులపై పడనుంది. చైనాతో పాటు యూకే, రష్యాలోనూ కేసుల సంఖ్య పెరగటం కలవర పాటుకు గురి చేస్తోంది.
థర్డ్ వేవ్ ప్రమాదం లేనట్లేనని భావిస్తున్న సమయంలో ఈ కేసులు తిరిగి ప్రారంభం థర్ద్ వేవ్ కు సంకేతాలుగా భావించాలా అనే చర్చ మొదలైంది. గత ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో బుధవారం కొవిడ్‌తో 223 మంది చనిపోయారు. దాదాపు 44 వేల కేసులు నమోదయ్యాయి. రష్యాలో రికార్డు స్థాయిలో 36,339 కేసులు నమోదయ్యాయి. 1,036 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చైనాలో విస్తరిస్తున్న వైరస్ వేరియంట్ల మీద అన్ని దేశాలు ఒక కన్నేశాయి. తమ దేశంలోకి ఆ వైరస్ ప్రవేశించకుండా తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.