Bangkok: భర్త సంతోషం కోసం ఓ భార్య ఉన్నతంగా ఆలోచించింది. తన బిజీ లైఫ్ కారణంగా భర్తను సంతోషంగా ఉంచలేకపోతున్నానని తెలిసి చలించిపోయింది. భర్త సంతోషం కోసం ఏకంగా ఓ అందమైన అమ్మాయిని పనిలో పెట్టాలని నిశ్చయించుకుంది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన ఫాతిమా చమ్నన్ అనే మహిళ తన బిజీ జీవితం కారణంగా భర్తతో సరిగ్గా గడపలేకపోతోంది. అతడు కోరుకున్న ఆనందాన్ని ఇవ్వలేకపోతోంది. దీంతో తనను ఓ చెడ్డ భార్యగా భావించి చలించిపోయింది. భర్తను సంతోషంగా ఉంచడానికి ఓ ప్లాన్ వేసింది. వెంటనే సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రకటన ఇచ్చింది. ‘కావలెను.. అందమైన, చదువుకున్న పెళ్లి కాని యువతులు కావాలి. మొత్తం ముగ్గురు యువతులు కావాలి. ఇద్దరు యువతులు నాతో పాటు ఆఫీస్ వర్క్ చేయాలి. మరో అమ్మాయి నన్ను, నా భర్త, పిల్లాడిని చూసుకోవాలి. ముఖ్యంగా నా భర్తను బాగా చూసుకోవాలి. అతడి కోర్కెను కాదనకూడదు. అతడు కోరుకున్నట్లు ప్రవర్తించాలి. ఒక్కొక్కరికీ నెలకి రూ. 33,500 జీతం ఇస్తాను. నేను ధీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడుతున్నాను. అందుకే నా భర్తను బాగా చూసుకోలేకపోతున్నాను ’’ అని పేర్కొన్నారు. ఇక, ఈ ప్రకటనపై ఆమె భర్త పట్టగోర్న్ స్పందిస్తూ.. ‘‘ నన్ను బాగా చూసుకోవటానికి ఆమెకు ఓ పనమ్మాయి కావాలని నా భార్య చెప్పింది. ఆ పనమ్మాయి మా ఇంట్లో మనిషిలాగా, కంపెనీలో కూడా మా ఫ్యామిలీ మనిషిలాగా చూసుకోబడుతుంది. ఎవరైనా నాలాంటి సౌకర్యాలు పొందాలనుకుంటే.. భార్యలతో మంచిగా ఉండండి. నాకైతే ఎలాంటి పనమ్మాయి అవసరం లేదు. కానీ, నా భార్య ఇస్తే మాత్రం వద్దనను’’ అని చెప్పుకొచ్చాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న సంస్థ!