ఈ మధ్య అందం కోసం, కండల కోసం తప్పుడు దారులు తొక్కుతున్న ఎందరినో చూస్తున్నాం. అందాల పోటీల్లో విజయం సాధించేందుకు నిషేదిత వస్తువులు వాడి డిస్క్వాలిఫై అయిన చాలా అంది ఉన్నారు. ఇప్పుడు అదే కోవలోకి ఒంటెలు కూడా చేరాయి. పాపం అవి కావాలని అలా చేయలేవు కదా. ఒంటెల అందాల పోటీల్లో విజేతలుగా నిలవాలని వాటి యజమానులు ఆ కక్కుర్తికి పాల్పడుతున్నారు. ఆ అందాల పోటీలో మొత్తం 40 ఒంటెలు డిస్క్వాలిఫై కావడంతో ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అసలు ఆ అందాల పోటీ ఏంటి? అవి ఎలా డిస్క్వాలిఫై అయ్యాయో తెలుసుకోండి.
Camel Crackdown flagged to us by @MollyJongFast: Dozens of camels have been kicked out of Saudi Arabia camel beauty contest over Botox and other “tampering.”
They are no longer eligible to win the contest’s $66M prize. pic.twitter.com/uAxUmcHrTz
— The Recount (@therecount) December 9, 2021
సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు ఈశాన్య భాగంలో కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగలో ఈ ఘటన జరిగింది. సంవత్సరంలో ఒకసారి ఒక నెలపాటు ఈ ఒంటెల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ పోటీలో గెలుపొందిన ఒంటెల యజమానులకు అక్షారాలా రూ.500 కోట్లు ప్రైజ్ మనీగా ఇస్తారు. ఒంటెల ఎత్తు, మూపురాలు, తల కట్టు ఇలా చాలా విభాగాల్లో గమనించి, న్యాయనిర్ణేతలు నిర్ణయించి విజేతలను ఎంపిక చేస్తారు. అచ్చు మనుషులకు జరిగే అందాల పోటీల తరహాలోనే.
43 #camels have been disqualified from a beauty contest in #SaudiArabia as organizers crack down on the use of #Botox injections. Camel breeders compete for more than $66 million in prize money at stake in the King Abdulaziz Camel Festival. pic.twitter.com/z2wYOgConZ
— CGTN Global Business (@CGTNGlobalBiz) December 10, 2021
అయితే ఈ పోటీల్లో పాల్గొనే ఒంటెలు అందంగా తయారయ్యేందుకు బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర ఉత్ప్రేరకాలు, నిషేదిత ఉత్పత్తులు వాడుతూ ఒంటెలను హిసిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ఒంటెలకు అలాంటివి వాడితే అనర్హత వేటు వేస్తారు. ఆ విషయాన్ని కనుగొనేందుకు తాజాగా కొత్త టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. అలా ఉపయోగించే మొత్తం 40 ఒంటెలను పోటీల నుంచి డిస్క్వాలిఫై చేశారు. అంతే కాదు ఆ ఒంటెల యజమానులకు భారీగానే జరిమానా కూడా విధించారు. ఈ పోటీల ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీస్తూ ఉత్ర్పేరకాలు వాడుతూ ఒంటెలను హింసిస్తున్నారు. వాటిని అందంగా తయారు చేయాలనే కక్కుర్తితో వాటి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రైజ్ మనీ కోసం ఇలాంటి పనులు చేస్తున్న వారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.