బిజినెస్ జెస్క్- బంగారం పేరు వింటేనే మగువల మనసు ఉప్పొంగిపోతుంది. బంగారానికి ఆడవాళ్లకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ప్రధానంగా మన భారత దేశంలో బంగారం సంప్రదాయంలో భాగమైపోయింది. ఏ శుభకార్యం జరిగినా బంగారు ఆభరణాలు తప్పనిసరి. భారత్ లో బంగారు నగలు లేని ఆడవాళ్లను దాదాపు ఉహించుకోలేము. అందుకే బంగారానికి, మగువలది విడదీయరాని అవినాభావ సంబందం అని చెప్పవచ్చు. భారత్ లో ఆడవాళ్లే కాదు మగవాళ్లు సైతం బంగారంపై మక్కువ ఎక్కువే. అడవాళ్లంత కాకపోయినా మగవాళ్లు సైతం బాగానే బంగారాన్ని ధరిస్తారు.
ఇక బంగారం ఎప్పటిలా షాపుకెళ్లి కొనేద్దామంటే ఇకపై అస్సలు కుదరదు. ఎలా పడితే అలా అమ్మెద్దామంటే జువెల్లరీ షాపులవారికి నడవదు. అవును బంగారం అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్న నిబంధనను తీసుకువచ్చింది. బంగారం కొనే వారు, అలాగే బంగారాన్ని విక్రయించే వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం దేశంలో బంగారం అమ్మె వారందరు కచ్చితంగా రేపటి నుంచి 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ కచ్చితంగా ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల వల్ల ఇకపై బంగారు కొనుగోలుదారులు ఏ మాత్రం నష్టపోరు. హాల్ మార్క్ బంగారం అందుబాటులోకి రావడంతో ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు. బంగారం స్వచ్ఛత కచ్చితంగా తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 15 నుంచే గోల్డ్ జువెలరీ హాల్ మార్క్ రూల్స్‌ను అమలులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే మోదీ సర్కార్ రెండు సార్లు ఈ గడువును పొడిగిస్తూ వచ్చింది. కానీ ఈ రోజు నుంచి అంటే జూన్ 15 నుంచి మాత్రం ఖచ్చితంగా హాల్ మార్క్ ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాలి. ప్రస్తుతం దేశంలో విక్రయించే 40 శాతం బంగారానికి మాత్రమే హాల్‌మార్క్ ఉంటోంది. ఇకపై వంద శాతం హాల్ మార్క్ బంగారం మాత్రమే మార్కెట్లో ఉండనుంది.