సాధారణంగా మనకు తెలిసి మేకలు, గొర్రెలు వంటి జంతువులు శాకాహారులు. ఇవి చెట్ల ఆకులు, ధాన్యాన్ని, గడ్డిని తిని బతుకుతాయి. అయితే ఓ జంతువు మాత్రం తన సహజ తత్వాన్నికి భిన్నంగా ప్రవర్తిస్తుంది. మాంసం ముట్టని, శాకాహార జంతువైన ఓ మేక నాన్ వెజ్ ఐటమ్స్ ను తెగ తినేస్తోంది. ఈ విషయం తెలిసిన చుట్టుకపక్కల ప్రాంతాల వారు వింత మేకను చూసి పోతున్నారు. ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని దేవాస్ పట్టణం సమీపంలోని లోహారి గ్రామంలో రఫీఖ్ అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయంతో పాటు కొన్ని ఆవులను, మేకలను రఫీఖ్ పెంచుకుంటున్నాడు. వీటిల్లో అతని దగ్గరుండే ‘భూరి’ అనే మేక మాత్రం ప్రత్యేకమైనది. కారణం ఈ మేకకు రోజూ నాన్ వేజ్ లేనిది ముద్ద దిగ్గదు. దీనికి చికెన్, మటన్, చేప, గుడ్లు అనే తేడా లేకుండా ఏదైనా తినేస్తుంది. ఇది చెట్ల ఆకుల వైపు అసలు కన్నెత్తి కూడ చూడటం లేదు.
ఈ విషయం తెలిసిన స్థానికులు ఈ మాంసాహార మేకను చూసి వెళ్తున్నారు.”మా వద్దనే పుట్టిన ‘భూరి’ని చిన్నప్పటి నుంచి పెంచుతున్నాను. మూడేళ్లు నుంచి మాంసాహారం తింటుంది. దీనికి చికెన్ రోజూ కావాల్సిందే.. నాన్ వేజ్ లేని రోజు తిండి మానేస్తుంది” అని రఫీఖ్ తెలిపారు. తన సహజ స్వభావాన్ని వదలి ఇలా వింతగా మాంసాహారం తింటున్న ఈ మేకపై అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.