Young Woman: సిగరేట్ తాగాలన్న సరదా ఓ అమ్మాయి ప్రాణాలు బలితీసుకుంది. సిగరెట్ తాగుతుండగా స్నేహితులు ఆమె ఫొటో తీసి బెదిరించటంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండోర్‌లోని సిలికాన్ సిటీ ఏరియాకు చెందిన ఇంటర్ చదివే అమ్మాయి కొద్దిరోజుల క్రితం స్నేహితురాళ్లతో కలిసి సిగరేట్ తాగింది. ఆమె సిగరేట్ తాగుతుండగా ఓ ఇద్దరు స్నేహితురాళ్లు దాన్ని ఫొటో తీశారు. అనంతరం ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో సదరు యువతి భయపడిపోయింది. విషయం అందరికీ తెలుస్తుందేమోనన్న ఒత్తిడికి గురైంది.
తల్లిదండ్రులు ఇద్దరూ వైద్య వృత్తిలో ఉన్న వారు. సోమవారం ఉదయం ఇద్దరూ విధులకు హాజరుకావటానికి ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. 10 సంవత్సరాల చెల్లెలు, 4 సంవత్సరాల తమ్ముడు అపార్ట్మెంట్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆడుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు గదిలో ఫ్యానుకు వేలాడుతున్న కూతుర్ని చూశారు. కిందకు దించి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయింది.
ఉరి వేసుకోవటానికి రెండు రోజుల ముందు.. ఆమె తన ఫ్రెండ్స్‌తో సిగరేట్ తాగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. స్కూల్లో కోచింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్‌తో సిగిరేట్ తాగానని, ఓ ఇద్దరు ఫ్రెండ్స్ దాన్ని ఫొటో తీశారని తండ్రికి చెప్పింది. ఆ ఫొటోను వైరల్ చేస్తామంటూ వాళ్లు బెదిరిస్తున్నారని వాపోయింది. కూతురు సిగరేట్ తాగిందని తెలిసినా ఆయన ఏమీ అనలేదు. ఫొటో గురించి భయపడొద్దని ధైర్యం చెప్పాడు. అయితే, యువతి మాత్రం ఫొటో వైరల్ అవుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రియుడి కోసం కూతుళ్లతో కలిసి మహిళ అరాచకం