సమాజంలో మనం ఇప్పటికీ ఎన్నో రకాల దీక్షలు చూశాం. జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరగాలని నిరాహార దీక్ష, మౌన దీక్షలు, ఇక ఇదే కాకుండా ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడు ఇంటి ముందు దీక్ష అని ఇలా ఎన్నో చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే దీక్ష మాత్రం పైవాటికి విరుద్దంగా ఉంటుంది. భర్త సంసారానికి పనికి రాడని ఓ భార్య ఏకంగా క్రిష్ణా నదిలో దీక్ష చేస్తోంది.
ఇది కూడా చదవండి: నిశ్చితార్థం రోజే ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరం గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మహిళకు వివాహమైంది. అయితే పెళ్లైన మూడు రాత్రులు భర్త తన వద్దకు రాలేదని, ఈ విషయం అత్తామామలకు చెప్పిన స్పందించలేదని వివాహిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదే కాకుండా ఈ విషయం బయటకు చెప్పొద్దని దీనికి పరిహారంగా రూ.15 లక్షలు ఇస్తామని అత్తామామలు బలవంతం కూడా పెట్టారని తెలిపింది.
ఇక ఈ క్రమంలోనే నాపై కోర్టులో పరువు నష్టం దావా కేసు కూడా వేశారని.. నాకు న్యాయం జరిగేంత వరకూ క్రిష్ణా నదిలో నీరు మాత్రమే తాగుతూ దీక్ష చేస్తానని బాదితురాలు ఆరోపిస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.