chittoor crime : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి మతాలు అడ్డొచ్చాయి. పెద్దలు ససేమీరా అన్నారు. పెద్దలు కాదన్నా వాళ్లు వినలేదు. పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే రెండు నెలల తర్వాత అసలు కథ మొదలైంది. బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగిరాలేదు. అతడికి ఏం జరిగింది?.. ఏమయ్యాడు? ఇవన్నీ ప్రశ్నలుగా మారి ఆమెను వేధిస్తున్నాయి. తన భర్త కనిపించకుండా పోవటానికి అత్తారింటి వాళ్లే కారణమని ఆరోపిస్తూ ఇంటి బయట నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, మదనపల్లె రూరల్ మండలం, దిగువ వాండ్లపల్లెకు చెందిన రమేష్ కుమార్, నల్గొండ జిల్లా, చింతలపల్లె మండలం, కుడిమేకు గ్రామానికి చెందిన మహ్మద్ సనా ప్రేమించుకున్నారు. జనవరి 4న మదనపల్లెలోని ఓ గుడిలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
మరుసటి రోజు నుంచే అత్తారింట్లో వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఇద్దరూ అక్కడి ఓ ఎస్టేట్లో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మూడు రోజుల క్రితం రమేష్ బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తన భర్తను అత్తారింటి వాళ్లే దాచిపెట్టారని ఆరోపిస్తూ సనా ఆందోళనకు దిగింది. అత్తింటి ముందు నిరసన దీక్ష చేస్తోంది. పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అత్తారింటి వాళ్లు, ఓ రాజకీయ పార్టీ నాయకుడు కలిసి తనను బెదిరిస్తున్నారని, భర్తకు దూరంగా వెళ్లిపోవాలంటున్నారని పేర్కొంది. అయితే, రమేష్ కుటుంబం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సనా కుటుంబీకులే రమేష్‌ను మాయం చేశారని ఆరోపించింది. ఇరు కుటుంబాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి.. ప్రేయసిని తోటలోకి ఎత్తుకెళ్లి..
5 నెలల గర్భవతి అని కూడా కనికరం చూపించలేదు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.