ఓ జంట పెళ్లి కోసం వరుడు, వధువు బంధువులతో కళ్యాణ మండపం అంతా కిక్కిరిసిపోయింది. నూతన జంటను ఆశీర్వదించేందుకు చుట్టాలు అంతా తరలిచ్చారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి కూడా జరిగింది. ఇక వరుడు, వధువు జంట చూడముచ్చటగా ఉండడంతో అత్తింటి బంధువులంతా మురిసిపోయారు. అయితే వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన ఈ జంటకు తాళి కట్టిన రోజే చివరి రోజుగా మారి నూతన వరుడు రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. పెళ్లి రోజే వరుడు మరణించడంతో వరుడి తల్లిదండ్రులతో పాటు వధువు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన జమ్మా న పవన్‌కుమార్ అనే యువకుడికి, సింహాచలంలో ఇదే మండలం శ్యామలాపురం ఆర్‌ఆర్ కాలనీకి చెందిన యువతిని ఇచ్చి గత శుక్రవారం ఘనంగా వివాహం చేశారు. ఇక వివాహ అనంతరం నూతను జంటను పెళ్లికి వచ్చిన బంధువులు అంతా ఆశీర్వదించారు. ఇక పెళ్లైన తర్వాత పెళ్లికి వచ్చిన చుట్టాలు అందరూ బస్సులో వచ్చారు. పవన్ మాత్రం తన మేనమామతో కలిసి బైక్‌పై బయల్దేరాడు.
ఇది కూడా చదవండి: బోరింగ్ కొడితే మద్యం వచ్చింది.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఎచ్చెర్ల మండలం అరిణాం–అక్కివలస ప్రాంతానికి రాగానే వీరి బైక్ ని వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా, సోమేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన రోజే వరుడు మరణించడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.