లోకం అంటే ఏంటో తెలియదు. మోసం, కుల్లు, కుతంత్రాలు ఇలాంటివేవి అసలే తెలియవు. అమాయకపు చూపులు, తల్లిదండ్రులే వారి సర్వస్వం. అలాంటి పసి హృదయాలు ఏకంగా తండ్రి చేతిలో బతికుండగానే నరకం చూశారు. మద్యానికి అలవాటు పడ్డ ఓ తాగుబోతు తండ్రి లోకం తెలియని పసిపిల్లలను రోజుకొక కారణంతో కొట్టి వేధించేవాడు. ఇలా కన్నతండ్రి వేధింపులను భరించలేని ఈ అమాయకపు చిన్నారులు ఏకంగా ఇల్లు గడప దాటి తల్లిదండ్రులు లేని అనాధలుగా రైలెక్కి విజయవాడ వచ్చేశారు.
ఇక రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై దీనంగా ఓ చోట భయం భయంతో కూర్చున్నారు. వీరిని గమనించిన క్లీనింగ్ సిబ్బంది చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన విజయవాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసకుంది. ఇక విషయం ఏంటంటే? వీరిది ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వేంకటేశ్వరస్వామి గుడి ప్రాంతం. ఇదే ప్రాంతంలో ఉంటామంటున్నారు మస్తానీ (9), మౌలాలీ (7) అనే అక్కా తమ్ముడు. తండ్రి ఎల్లప్ప కూలింగ్ నీళ్లు అమ్మే పని చేస్తుంటాడని, తల్లి శ్యామల కుర్చీలకు వైర్లు అల్లుతుందని అంటున్నారు. అసలు ఇల్లు వదిలి ఎందుకు వచ్చారనే ప్రశ్నకు మాత్రం.. ‘నాన్న రోజూ మద్యం తాగడానికి అమ్మను డబ్బుల కోసం సతాయిస్తుంటాడని, ఇవ్వకపోగా కొడతాడని చెబుతున్నారు.ఇక ఇచ్చాక తాగి వచ్చి అమ్మను, ఆ తర్వాత మమ్మల్ని కొడుతూ ఉంటాడు. అందుకే తమ్ముడు, నేను, ఇల్లు వదిలి నాన్నకు దూరంగా వచ్చేశాం, ఇక మార్కాపురంలో ఉన్న నాన్న దగ్గరకు వెళ్లం.’ అని మస్తానీ వచ్చి రాని మాటలతో చెబుతోంది. ఇక వీరిని గమనించిన క్లీనింగ్ సిబ్బంది రైల్వే చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు తదుపరి సంరక్షణ కోసం జీఆర్‌పీ స్టేషన్లో ఉంచారు. ఇక వీరి కోసం బంధువుల ఎవరూ రాలేదు.
ఇది కూడా చదవండి: Bengal: కళ్ళ ముందే చనిపోయిన ఏనుగు పిల్ల! తల్లడిల్లిన తల్లి ఏనుగు!
ఇక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు బాలుడిని విజయవాడ ఎస్‌కేసీవీ చి్రల్డన్ ట్రస్టు వసతి గృహంలో ఉంచగా, బాలికను ప్రజ్వల బాలికల వసతి గృహంలోనూ తాత్కాలికంగా ఉంచామని అధికారులు తెలిపారు. అనంతరం పిల్లలు చెప్పిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.