Identical Twins: ఐడెంటికల్ ట్విన్స్.. ఒకేలా ఉండే ఇద్దరు వ్యక్తులు. సాధారణంగా వీరిలో ఎవరు, ఎవరో గుర్తు పట్టడం చాలా కష్టం. నడకలో, నడతలో.. కొంతమంది ఐడెంటికల్ ట్విన్స్ అలవాట్లలో కూడా సామీప్యం ఉంటుంది. కొత్త వాళ్లయితే వీరిని గుర్తించటం అసాథ్యం. ఇలాంటి లక్షణాలున్న ఐడెంటికల్ ట్విన్స్పై చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో అజిత్-ఎస్ జే సూర్య కాంబినేషన్లో వచ్చిన ‘‘వాలి’’సినిమా ఓ సెన్సేషన్‌గా నిలిచింది. ఐడెంటికల్ ట్విన్స్ శివ, దేవలుగా.. అదీ ఓ పాత్రలో హీరోగా.. మరో పాత్రలో విలన్‌గా అజిత్ నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో శివ, ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే, దేవ కూడా ప్రియని ప్రేమిస్తాడు.
తమ్ముడితో ఆమెకు పెళ్లయిందని తెలిసినా ప్రేమను చంపుకోడు. ఆమెను దక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చివరకు తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. కొంచెం అటు ఇటుగానో.. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఐడెంటికల్ ట్విన్స్‌లో ఒకడైన అన్న తమ్ముడి భార్యపై మనసుపారేసుకున్నాడు. తమ్ముడిలా నటించి ఆమెపై అత్యాచారం చేయసాగాడు. దాదాపు ఆరు నెలలు ఇలా జరిగింది. మరదలికి నిజం తెలిసింది. భర్త,కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వాళ్లు ఇచ్చిన సమాధానంతో ఆమె బుర్ర గిర్రున తిరిగింది. చేసేదేమీ లేక బావపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్‌లోని ఓ కుటుంబంలో ఐడెంటికల్ ట్విన్స్ అయిన అన్నదమ్ములు ఉన్నారు. ఆ ప్రాంతంలో వీరు ఓ స్పెషల్ అట్రాక్షన్లా నిలిచారు. వీరిని ఎవరు..ఎవరని గుర్తుపట్టలేక జనం అల్లాడిపోయేవారు. ఒక్కోసారి కన్న వాళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. కవలలైన అమ్మాయిల కోసం వెతికారు. కానీ, దొరకలేదు. దీంతో ఎవరినో ఒకర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ, పెద్ద వాడు పెళ్లిపై ఉత్సాహం చూపించలేదు. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పాడు. ఇక, తల్లిదండ్రులు చేసేదేమీ లేక చిన్నవాడికి సంబంధం చూసి పెళ్లి చేశారు. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టింది.
పెళ్లి చేసుకోకుండా ఆగిపోయిన పెద్దవాడికి మరదల్ని చూడగానే ఆశపుట్టింది. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్నాడు. తమ్ముడు లేని సమయంలో వారి గదిలోకి దూరేవాడు. మరదలితో కాపురం చేసేవాడు. ఇలా ఆరునెలలు గడిచింది. అతడు తన భర్త కాదని మరదలికి తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని భర్త, కుటుంబసభ్యులకు చెప్పింది. ఇందుకు వారు అతడిపై కోప్పడలేదు సరికదా.. సర్ధుకుపొమ్మని సలహా ఇచ్చారు. వారి మాటలతో బాధితురాలు కంగుతింది. పోలీసులను ఆశ్రయించింది. బావపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరి, సినిమాను తలపించే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jammu & Kashmir: అంత్యక్రియలు చేస్తుండగా చనిపోయిందన్న శిశువులో కదలికలు!