కులం పునాదుల మీద మీరు ఏం సాధించలేరు. ఒక జాతిని కానీ నీతిని కాని నిర్మించలేరు… ఆనాడు అంబేద్కర్ చెప్పిన మాటలు ఇప్పటికీ అందరి చేవుళ్లో మారుమోగుతూనే ఉన్నాయి. కానీ శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్న అఖండ భారతవనిలో ఇంకా కుల వివక్ష రాజ్యమేలుతూనే ఉంది. అంటరాని వారిని, దళిత కులస్తులను అగ్రకులాలవారు విర్రవీగుతూ కుల వివక్షను పారదోలకుండా పెంచి పోషిస్తున్నారు.
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి కథనంలోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలిలో కులం పేరుతో దళిత వర్గానికి చెందిన మైనర్ బాలుడిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గులు ఆ మైనర్ బాలుడిని చెవులు పట్టుకుని గుంజీలు తీయమని చెబుతుంటారు. కొందరు యువకులు మోటర్ సైకిళ్లపై కూర్చొని బాధితున్ని దుర్భాషలడుతూ.. నాలుకతో అతని కాలు నాకించుకుంటూ.. మళ్లీ అలాంటి తప్పు చేస్తావా? అంటూ హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు.. మూడ్రోజుల పాటు యువతికి నరకం!
బాధితుడు నేలపై భయంతో వణుకుతున్నప్పుడు అగ్రజాతిగా ఠాకూరు కులస్తులు నవ్వుతుంటారు. మరో యువకుడు ఠాకూర్ కులం పేరు చెప్పమని అదిలిస్తుంటారు. ఇక ఆ బాలుడిని అంతలా బెదిరించటానికి కారణం ఆ బాలుడి తల్లి వాళ్ల పొలంలో పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వమని అడగటమేనట. ఈ కారణం చేత ఆ మైనర్ బాలుడిని దారుణంగా వ్యవహరించారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్రకులస్తులైన ఆ దుండగులను అరెస్ట్ చేశారు. ఈ దారుణాన్ని అక్కడున్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇంతటి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.