crime news : ఎంత చెప్పినా తక్కువే అనుకుని బాధపడే ఘోరాల్లో మహిళలపై అత్యాచారాలు మొదటిస్థానంలో ఉంటాయి. ప్రతి గంటకు ప్రపంచంలో ఏదో ఒక చోట మహిళపై అత్యాచారం జరుగుతూనే ఉంటుంది. ఆ చోటు, ఈ చోటు అని తేడా లేకుండా అవకాశం ఉన్న ప్రతీ చోట అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు నీచులు. తాజాగా, రైల్వే స్టేషన్‌లో టాయిలెట్‌కు వెళ్లిన మహిళపై కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ భార్యాభర్తల జంట శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్ ఘర్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తోంది.
భర్త టీ తేవటానికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న అన్న అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. ఓ కీ ఆమెకు అందించాడు. పక్కనే ఉన్న పార్కింగ్ ప్లేసు దగ్గర శుభ్రమైన టాయిలెట్లు ఉన్నాయని, అవసరం అయితే వాటిని వాడుకోండని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె అక్కడికి వెళ్లింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న అన్న.. ఆమె లోపలికి రాగానే అత్యాచారం చేశాడు. తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. తనపై అత్యాచారం జరిగిన సంగతిని ఆమె భర్తకు చెప్పింది. ఇద్దరూ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బాలికతో ఎఫైర్.. వద్దన్నా వినలేదు.. పక్కా ప్లాన్‌తో..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.