ఈ మద్య కోతులు ఆహారం కోసం ఇండ్ల మీద పడిపోతున్నాయి. కొన్ని చోట్ల రోజంతా ఇళ్లలోనే తిష్టవేసి సరుకులు చిందర వందరగా పడేసి ఎత్తకుపోతున్నాయి. కోతులను బయటకు తరిమేందుకు ప్రయత్నిస్తే ఇంట్లో జనాలపై దాడి చేస్తున్నాయి. కోతులు గుంపులు గుంపులుగా తిరగడంతో.. మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు రోడ్ల పైకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఓ కోతి నాలుగు నెలల చిన్నారి మూడంతస్తుల భవనం నుంచి విసిరివేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇక జనావాసాల్లో మనుషుల మధ్యన మనుగడ సాగిస్తుండే కోతుల ఆగడాలకు అంతేలేకుండా పోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో దారుణం చోటు చేసుకుంది. నిర్దేశ్ ఉపాద్యాయ్ అనే వ్యక్తి తన భార్య, నాలుగు నెలల బాబుతో మేడపైకి వచ్చాడు. అదే సమయంలో కోతుల గుంపు రావడంతో భయంతో కిందకు దిగే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే చేతిలో నుంచి బాబు జారిపోయాడు. నిర్ధేష్ చేతి నుంచి జారిపడ్డ చిన్న బాబుని ఓ కోతి టక్కున అందుకుంది.
అప్పటికే కొతిని బెదిరించి బాబును తీసుకునే ప్రయత్నం చేయాలని చూసినా.. మేడ పై నుంచి చిన్నారిని కోతి విసిరివేసింది. మేడ పై నుంచి కింద పడిపోయిన నాలుగు నెలల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు తమ చేతిలో ఉన్న చిన్నారి కోతి రూపంలో మృత్యువ కబలించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. కోతుల బెడద ఎక్కువగా ఉందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ప్రేమించని పాపానికి ఇలా చేస్తావా? ఉన్మాదిగా మారిన వన్ సైడ్ లవర్ ఏం చేశాడంటే?