ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ.. ఆ వృత్తికే కళంకం తెచ్చే పనులు చేశారు. భర్త వేధిస్తున్నాడని మరో ఉపాధ్యాయుడికి దగ్గరైతే.. అవసరం తీర్చుకుని అతను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. నగ్న ఫొటోలు, దృశ్యాలు తీసి కావాల్సిన చోటుకు రప్పించుకున్నాడు. ఆమెను తన సుఖాలు తీర్చే ఓ కీలు బొమ్మగా మార్చేసుకున్నాడు. రెండు మంచి మాటలు చెప్పగానే అతడికి లొంగిపోయి ఇప్పుడు జీవితంలో కుంగిపోయింది. ఇంక అతని వేధింపులు భరించలేక మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి తనని తాను కాపాడుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా రావికమతం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు సూరెడ్డి మహేశ్వరరావుకు.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఉపాధ్యాయినితో గతేడాది పరిచయం ఏర్పడింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ఓ ట్రైనింగ్ సెషన్ లో వీరికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ చనువుతో టీచర్ మహేశ్వరరావుకు తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం మొదలు పెట్టింది. 2019లో ఆ టీచర్ కు వివాహం జరిగింది. తన భర్త రోజూ వేధింపులకు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడంటూ ఆమె మహేశ్వరరావుతో చెప్పుకుంది.
నాలుగు మంచి మాటలు చెప్పి మోరల్ సోపోర్ట్ ఇవ్వడంతో ఆ టీచర్ మహేశ్వరరావుకు కనెక్ట్ అయ్యి పోయింది. వారి మధ్య స్నేహం కాస్తా.. వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరూ తరచూ విజయవాడలోని హోటళ్లు, లాడ్జీల్లో కలుస్తుండేవారు. ఆ సమయంలో పడక సుఖాలు తీర్చుకోవడం అలావాటు అయ్యింది. అలాగే ఓ రోజు లాడ్జీలో కలిశారు. అలిసిపోయి నిద్రపోతున్న ఆ టీచర్ ను వివస్త్రను చేసి మహేశ్వరరావు ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ నగ్న ఫొటోలను అడ్డు పెట్టుకుని ఆమెను కీలు బొమ్మగా మార్చాడు. అతను ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాలి. లేదంటే ఆ ఫొటోలు, వీడియోలు బయట పెడతానంటూ బెదిరింపులకు దిగాడు.
ఇదీ చదవండి: మరిదిపై కన్నేసిన వదిన.. పడక సుఖం కోసం పగ పట్టి..!
ఆ టీచర్.. అతను చెప్పిన విధంగా నడుచుకోవడం మొదలు పెట్టింది. ఆమెకు తెలీకుండా ఆమె ఫోన్ లో ఓ సీక్రెట్ యాప్ కూడా ఇన్ స్టాల్ చేశాడు. ఆమె ఎవరితో మాట్లాడుతోంది. ఎక్కడికి వెళ్తోంది ఇలా ట్రాక్ చేయడం మొదలు పెట్టాడు. మొత్తానికి ఆమెను పూర్తిగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. ఇంక మహేశ్వరరావు వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో ఆ టీచర్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఎలాగైనా మహేశ్వరరావు చెర నుంచి తప్పించుకోవాలని భావించింది. వెంటనే విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహేశ్వరరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భర్త వేధిస్తన్నాడని తన బాధలను దారిన పోయే దానయ్యకు చెప్పుకుంటే పరిస్థితులు ఇలాగే మారుతాయి. అలాంటి ఇబ్బందులు ఉంటే చెప్పుకోవాల్సింది అయినవారితో. అవకాశం దొరికితే వాడుకోవాలని చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఆ విషయాన్ని గ్రహించే సమయానికి జరగాల్సిన చెడు కాస్తా జరిగిపోయింది. ఇప్పుడు ఇదంతా తెలిస్తే భర్త కూడా వేధించడం మొదలు పెడతాడు. విషయం తెలిసినవారు.. నలుగురికి మంచి చెప్పాల్సిన వృత్తిలో ఉంటూ ఇలాంటి పనులు చేయడం నిజంగా తల దించుకోవాల్సిన పనే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సోదరుడితో కలిసి భార్యపై భర్త దారుణం! తల నరికి మరీ..