సమాజంలో ఎన్ని రకాల నేరాలు జరుగుతున్నాయంటే అవి వింటేనే ఛీ అనిపించక మానదు. ఇప్పుడు చెప్పుకోబోయే క్రైమ్ ఎంతటి దారుణమైనది అంటే భర్త ఎదురింటి మహిళపై కన్నేస్తే.. కట్టుకున్న భార్య దగ్గరుండి ఆ మహిళపై అత్యాచారం చేయించింది. అంతేకాదు ఆ పాడుపనిని ఫొటోలు, వీడియోలు తీసింది. రెండుసార్లు ఆ మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా.. నా మిత్రులు కూడా వస్తారంటూ ఆమెను బెదిరంచడంతో అసలు కథ వెలుగు చూసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. అజిత్ సింగ్ నగర్ లో దిలీప్, తులసి దంపతులు నివాసం ఉంటున్నారు. వారి ఎదురింట్లో ఓ క్యాటరింగ్ కుటుంబం నివసిస్తోంది. ఆ మహిళపై దిలీప్ కన్ను పడింది. ఆ విషయాన్ని తన భార్యతో కూడా పంచుకున్నాట్లున్నాడు. అతను ఆ పాడు పని చేసేందుకు భార్య నూరు శాతం సహకారం అందించింది. జనవరి 3న రాత్రి ఆ మహిళ తన ఇద్దరు పిల్లతో కలిసి ఇంట్లో నిద్ర పోతోంది. వారి ఇంట్లోకి దిలీప్- తులసి అక్రమంగా ప్రవేశించారు. నిద్రపోతున్న మహిళ నోరు నొక్కి వారి ఇంట్లోకి లాక్కెళ్లారు.
అలా వారి ఇంట్లోకి లాక్కెళ్లిన మహిళపై భర్త అత్యాచారం చేశాడు. అతను ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా భార్య తులసి ఆ దారుణాన్ని ఫోన్ లో వీడియో తీసింది. ఆ రాత్రి దిలీప్ ఆ మహిళపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాతి రోజు కూడా ఆ మహిళను బెదిరించి మళ్లీ అత్యాచారం చేశాడు. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో అని ఆ మహిళ భయాందోళన చెందడం మొదలు పెట్టింది. ఎవరికైనా చెప్పాలి అంటే వారి దగ్గర వీడియోలు, ఫొటోలు ఉన్నాయని సైలెంట్ గా ఉండిపోయింది.
ఇదీ చదవండి: ఈమె ఆడది కాదు.. కామ పిశాచి!
అయితే దిలీప్- తులసి దంపతులు అక్కడితో ఆగలేదు. దిలీప్ మహిళను మరోసారి బెదిరించాడు. ఈసారి తన వద్దకు రావాలని కాదు.. తన మిత్రులు వస్తారు.. వారికి కూడా సుఖం పంచాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఒప్పుకోకపోతే ఆ వీడియోలు అందరికీ చూపిస్తాను. నీ పిల్లలను చంపేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. వారి వేధింపులు తట్టుకోలేక మహిళ పోలీసులను ఆశ్రయించింది. దిలీప్- తులసిపై ఐపీసీ 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ మహిళ ధైర్యం చేయబట్టి వారి చెర నుంచి ఆమెను కాపాడుకోగలిగింది. లేదంటే వాళ్లు ఆ మహిళను ఓ ఆట వస్తువుగా మార్చి వారి కామవాంఛలు తీర్చుకునేందుకు వాడుకునేవారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఈ కిరాతక దంపతులకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.