ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎన్నిసార్లు ఖండించినా.. ఎన్నిసార్లు గొంతెత్తినా.. ఎక్కడో ఒకచోట ఆడపిల్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏదొక మూల ఓ ఆడకూతురిపై అఘాయిత్యం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ లో ఓ యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన యువతి శవంగా దొరికింది. అది కూడా మెడలు విరిచి, తల పగలగొట్టి హత్యచేసిన స్థితిలో ఉంది. దొరికింది కూడా దివంగత మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ కు చెందిన ఆశ్రమం సమీపంలో.
వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం ఆ యువతి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ యువతి ఆచూకీ లభించలేదు. తాజాగా ఆమె దివంగత మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ కు చెందిన ఆశ్రమం సమీపంలో ఓ సెప్టిక్ ట్యాంక్ లో శవం దొరికింది. దుండగులు దుప్పటిలో చుట్టి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ యువతి మెడలు విరిచినట్లు, తలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
#Horrific The Dalit girl, who had been kidnapping for the last two months, was found in buried in a septic tank located at a vacant plot of Samajwadi party leader Fateh Bahadur Singh in Kabba Kheda area in Unnao district, Utter Pradesh.#DalitLivesMatterpic.twitter.com/tOgVO0saGX
— The Dalit Voice (@ambedkariteIND) February 11, 2022
డిసెంబర్ 8న తమ కుమార్తె కనిపించట్లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే బాధితుల వాదనను పోలీసులు ఖండిస్తున్నారు. వారు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజోల్ సింగ్ ను విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Unnao: Body of a young woman, who went missing two months back, has been recovered from the property of a former SP Mantri Fateh Bahadur Singh’s son.
Political war of words starts brewing.
Listen to these reactions.
Amir Haque with more details. #UnnaoMurder pic.twitter.com/shkt5a9rSf
— TIMES NOW (@TimesNow) February 11, 2022