మసాజ్ సెంటర్ పేరుతో సమాజంలో జరుగుతున్న ఎన్నో చీకటి వ్యాపారాలను పోలీసులు రట్టు చేశారు. ఎన్ని దాడులు చేసి ఎంతమందిని అరెస్టు చేసినా.. ఆ వ్యాపారలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. మసాజ్ సెంటర్ ముసుగులో దర్జగా వ్యభిచారం నడిపిస్తున్న ముఠా బారి నుంచి యవతులను కాపాడారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
దేశం నలుమూలల నుంచి యువతులను ఉద్యోగం, ఉపాధి పేరుతో లక్నో తీసుకొస్తున్నారు. అక్కడ వారిని ఓ ఇంట్లో ఉంచి వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. వారికి మత్తిచ్చి కస్టమర్ల దగ్గరకు పంపుతూ వ్యభిచార రాకెట్ ను నడుపుతున్నారు. వారి చెర నుంచి తప్పించుకున్న ఓ యువతి పోలీసులను ఆశ్రయిచింది. వారికి జరుగుతున్న అన్యాయం గురించి పోలీసులకు చెప్పింది. దాడులు జరిపి పోలీలులు ఆ మసాజ్ సెంటర్ ను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేశారు. అక్కడ బంధీలుగా ఉన్న 8 మంది యువతులను విడిపించారు.
మిగిలిన వారిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని బలవంతంగా అక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఓ యువతి ఫిర్యాదు చేసిందని ఈస్ట్ జోన్ డీసీపీ ఖాసీం తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.