crime news : ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 46 ఏళ్ల వ్యక్తిని కొందరు మహిళలు చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. ఈ సంఘటన త్రిపురలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలాయ్ జిల్లాకు చెందిన ఓ ఐదేళ్ల పాప కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి తల్లితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ 46 ఏళ్ల వ్యక్తి పాపను తల్లినుంచి పక్కకు తీసుకువచ్చాడు. దగ్గరలోని అడవిలోకి తీసుకెళ్లి అత్యచారం చేశాడు. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. బాలిక అరుపులు వినిపిస్తుండటంతో జనం అక్కడికి వెళ్లారు.
పాపను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక తనను తీసుకెళ్లిన అతడి పేరు చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు గాంధాచెర-అమర్‌పుర్ హైవేను బ్లాక్ చేసి ధర్నా నిర్వహించారు. అత్యాచార నిందితుడ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అక్కడికి దగ్గరలోని ఓ ఊర్లో నిందితుడ్ని కొందరు మహిళలు పట్టుకున్నారు. అతడ్ని చెట్టుకు కట్టేసి చావ చితకొట్టారు. ఆ దెబ్బలకు అతడు మరణించాడు. దీంతో శవాన్ని రోడ్డు పక్కన పడేశారు. ముగ్గురు మహిళలు ఓ వ్యక్తిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియోలోని ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : దారుణం: బతికి ఉండగానే కూతురిని భూమిలో పాతిపెట్టిన కసాయి తల్లి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.