దాంపత్య జీవితం అన్నాక మూతి విరుపులు, గిల్లిగజ్జాలు సర్వ సాధారణం. కొన్నిసార్లు పిలిచినా తప్పే అంటారు. కానీ, అవి శ్రుతి మించ కూడదు. అలా లైన్ క్రాస్ అయితే తిప్పలు తప్పవు. అలా రోజూ తాగొచ్చి భార్యను వేధిస్తున్న ఓ భర్తకు ఆమె షాకింగ్ శిక్ష వేసింది. నిద్రపోతున్న భర్తకు వాటర్ హీటర్ వైర్లు చుట్టి స్విచ్ ఆన్ చేసింది. ఆ తర్వాత అది సాధారణ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ, దొరికిపోయింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కేంద్రం సీతారమపురంలో మోర నాగరాజు(38)- గౌతమి దంపతులు నివాసం ఉండేవారు. నాగరాజు తాపీ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. గౌతమి సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తోంది. నాగరాజు మొదట్లో బాగానే ఉండే వాడు. కానీ, కొన్నాళ్లుగా తాగొచ్చి భార్యతో గొడవలు పడటం చేస్తున్నాడు. రోజూ భార్యతో గొడవ పడి గౌతమి విసిగిపోయింది. ఎప్పటిలాగానే మంగళవారం కూడా తాగొచ్చి భార్యతో గొడవ పడి వరండాలో నిద్రపోయాడు.
నాగరాజు ప్రవర్తనతో విసిగిపోయిన గౌతమి అతడిని వదిలించుకోవాలని భావించింది. వాటర్ హీటర్ వైర్లు పీకి పూటుగా తాగి నిద్రపోతున్న భర్త కాళ్లకు కట్టింది. ఆ తర్వాత స్విచ్ ఆన్ చేసింది. విద్యుదాఘాతంతో నాగరాజు చనిపోయాడు. అది సహజ మరణం అన్నట్లు చిత్రీకరించేందుకు గౌతమి చాలా కష్టపడింది. మేడారం జాతరకు వెళ్లిన తల్లికి విషయం తెలిసి వెంటనే ఊరికి తిరిగొచ్చింది. కొడుకి మృతదేహం చూడగానే ఆమెకు అనుమానం కలిగింది. నాగరాజు ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: పెళ్లింట విషాదం.. ప్రమాదవశాత్తు 13 మంది మృతి
అత్త వెంటనే కోడలిని నిలదీసింది. తన కుమారుడికి ఏం జరిగిందని గట్టిగా అడగటంతో హత్య చేసినట్లు గౌతమి ఒప్పుకుంది. ఆ విషయం తెలుసుకున్న బంధువులు గౌతమిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇష్టంలేని భర్తతో కాపురం చేయడం కన్నా పెద్దలతో మాట్లాడో.. విడాకులు తీసుకుని తన దారి తాను చూసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. ఇలా హత్య చేయడం వల్ల నాగరాజు ప్రాణం పోవడమే కాదు.. గౌతమి జైలు పాలు అయ్యింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బయటకి ఫ్యామిలీ టైప్! లోపల మాత్రం ఆంటీలతో..!