ఈ రోజుల్లో సహనం, సర్దుకుపోవడం అనే పదాలకు చాలా మందికి అర్థం కూడా తెలిసే పరిస్థితి లేదు. ఏ చిన్న విషయమైనా తీవ్రంగా స్పందిస్తుండటం చూస్తుంటాం. దంపతుల్లోనూ ఆ తత్వం కనిపించడం లేదు. భాగస్వామి ఒక మాట అంటే దానిని భూతద్దంలో పెట్టి చూసి పెద్ద గొడవలు పడుతుండటం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే భార్య అయితే తనతో గొడవ పడ్డాడని ఏకంగా భర్తనే హత మార్చింది. దంపతులూ ఇద్దరూ పూటుగా మందుతాగారు. ఆ మత్తులో ఆమెకు భర్త తనతో గొడవ పడిన విషయం గుర్తొచ్చింది. ఆ తర్వాత ఆమె భర్తపై దారుణంగా పగ తీర్చుకుంది. దానిని దాచిపెట్టేందుకు ఎంతో ప్రయత్నించి విఫలమైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ లో అనిల్ కుమార్- మంజు దంపతులు నివాసముంటున్నారు. భార్యభర్తలు ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండే వారు. బుధవారం తెల్లవారుజామున అనిల్ కుమార్ ఇంట్లో చనిపోయి ఉన్నాడు. మంజు మాత్రం అతను ఎలా చనిపోయాడో నాకు తెలీదు అంటూ బుకాయించింది. మొదటి నుంచి కోడలి వ్యవహారంపై అనుమానం ఉన్న అత్త.. కొత్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.
పోలీసుల కథనం ప్రకారం.. అనిల్- మంజు ఇద్దరూ మద్యానికి బానిసలు. తరచూ భార్యభర్తలు ఇద్దరూ మందు తాగుతారు. ఆ తర్వాత తరచూ గొడవలు పడుతుండేవారు. మంగళవారం రాత్రి కూడా దంపతులు మద్యం సేవించారు. ఆ తర్వాత గొడవ పడ్డారు. ప్రతిసారి అనిల్ తనతో గొడవ పడుతున్నాడనే కోపంతో మంజు అనిల్ ను వదిలించుకోవాలని భావించింది. మందుతాగిన తర్వాత అనిల్ కు నీళ్లలో నిద్రమాత్రలు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన అనిల్ కుమార్ ను మంజు బెల్టుతో గొంతు బిగించి.. ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత తనకేమీ తెలీదు అంటూ కథలు చెప్పింది.
ఇదీ చదవండి: భార్యకి ఎయిడ్స్! అలాంటి భార్య నాకు వద్దన్న భర్త! చివరికి ఊహించని ట్విస్ట్!
పోస్టుమార్టం రిపోర్టులో కూడా హత్య జరిగినట్లు రిపోర్టు రావడంతో.. పోలీసులు మంజును గట్టిగా ప్రశ్నించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంజు కూడా భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. అయితే ఆ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మాత్రం చెప్పలేదు. అసలు మద్యం మత్తులో ఈ హత్య చేసిందా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తన కొడుకుని కోడలే హత్య చేసిందని తెలిసి తల్లిదండ్రులు ఇద్దరూ కన్నీరుమున్నీరయ్యారు. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడటం.. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.