దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా అమ్మాయి, మహిళలు మరీ దారుణంగా చిన్న పిల్లలు, వృద్దులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. కొంత మంది వావీవరసలు మరిచి మృగాళ్లు అత్యాచారాలకు తెగబడుతున్నారు. కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అంతే కాదు ఈ దారుణాన్ని వీడియో తీసి బాలికను బెదిరించారు.
ఇటీవల ఆ బాలికలో వస్తున్న మార్పు చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఒకరోజు బాలిక కడుపు నొప్పితో బాధపడింది.. ఆ సమయంలో ఏడ్చింది.. ఆ సమయంలో తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగారు. దానికి ఆ బాలిక తాను తిన్న కబాబ్ కారంగా ఉండటంతో కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. కానీ బాలిక నిరసంగా కనిపించడంతో గట్టిగా అడిగారు. దాంతో అసలు విషయం బయట పెట్టింది బాలిక. వెంటనే తల్లిదండ్రులు యెలహంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.