గతంలో అతను హత్య కేసులో దోషి. జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆ తర్వాత గతాన్ని మర్చిపోయి మంచిగా మారాడు. పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని మొదలు పెట్టాడు. కానీ, ఆ గతం అతడిని మర్చిపోలేదు. శత్రువులు పాత కక్షలను మనసులో పెట్టుకుని.. అవకాశం కోసం ఎదురు చూశారు. కొడుకు పుట్టాడనే ఆనందంలో మిత్రులను పిలిచి పార్టీ ఇచ్చాడు. కోరుకున్న అవకాశం వెతుక్కుంటూ వచ్చిందని శత్రువులు ఆనందపడ్డారు. పీకల దాకా తాగి.. కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆ వ్యక్తి మృతి చెందాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి దేవునిపల్లికి చెందిన ప్రశాంత్(26) ట్రావెల్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టాడనే ఆనందంలో ప్రశాంత్ మిత్రులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు. దేవునిపల్లికి చెందిన ముగ్గురు స్నేహితులతో అశోక్ నగర్ లోని మరో మిత్రుడి రూమ్ లో పార్టీ ప్లాన్ చేశాడు. మిత్రులు అక్కడికి చేరుకుని అందరూ పూటుగా తాగారు. ప్రశాంత్ గతాన్ని మర్చిపోయినా కూడా మిత్రుల రూపంలో ఉన్న శత్రువులు దానిని మర్చిపోలేదు.
ప్రశాంత్ ను హత్య చేయాలనే ప్లానింగ్ తోనే వాళ్లు ఆ పార్టీకి వచ్చారు. వస్తూనే వారితో పాటు కత్తులు కూడా తెచ్చుకున్నారు. మద్యం సేవించిన తర్వాత మూత్రవిసర్జనకు వెళ్లిన ప్రశాంత్ వెనుకే వాళ్లు కూడా వెళ్లారు. వారితో తెచ్చుకున్న కత్తులు తీసి ప్రశాంత్ ను అతి కిరాతకంగా పొడిచారు. వారి కత్తిపోట్లకు ప్రశాంత్ చనిపోయాడనుకుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కొనఊపిరితో ఉన్న ప్రశాంత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రశాంత్ ను ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి నుంచి నిమ్స్ కు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ప్రశాంత్ ఆదివారం మృతి చెందాడు.
ఇదీ చదవండి: వావివరసలు మరిచి.. బాబాయితో అక్రమ సంబంధం.. భర్తకు తెలియడంతో!
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు 25 ఏళ్లలోపు వారేనని.. వారు కూడా దేవునిపల్లి గ్రామ వాసులే అని తెలుస్తోంది. హత్యకు పాతకక్షలే కారణం అనే ప్రచారాలు రావడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంత్ గతంలో సొంత అన్ననే హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కానీ, అతను గతంలో చేసిన నేరాలు అతడిని వదలలేదు. పాతకక్షలే అతని ప్రాణాలు తీశాయని సమాచారం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.