ఎప్పుడూ చెప్పుకునే విధంగానే అనుమానం, అక్రమ సంబంధం ఎప్పుడూ ప్రతీకారాన్నే కోరుకుంటాయి. అలా ఓ భార్య చేసిన తప్పు, ఓ భర్తకు మొదలైన అనుమానం ఓ దారుణానికి దారి తీశాయి. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత అది నిజం అని కూడా తెలిసింది. లేచిపోయిన భార్యను వెనక్కి తెచ్చి సోదరుడితో కలిసి ఆమెను అతి దారుణంగా తల నరికి చంపాడు. ఆ తర్వాత ఆ తలతో రోడ్డుపైకి వచ్చి నవ్వుతూ తిరిగాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఇరాన్ లో జరిగింది ఈ దారుణ ఘటన. అహ్వాజ్ లో ఓ వ్యక్తి భార్య మోనా హీదారీ(17)తో నివాసం ఉంటున్నాడు. వారికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందనేది భర్త వాదన. అందుకు భార్య ఒప్పుకోకపోగా భర్తపై గొడవకు దిగేది. కొన్నాళ్లకు ఆమెకు వేరే యువకుడితో సబంధం ఉన్న విషయం బట్టబయలైంది. ఆమె అతనితో కలిసి టర్కీ దేశానికి పారిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం గాలించిన ఆమె తండ్రి, భర్త చివరికి ఇరాన్ కు తీసుకొచ్చారు.
భార్య ఇంటి నుంచి పారిపోవడంతో తన పరువంతా పోయిందని భావించి భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన సోదరుడితో కలిసి భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఆమె తల నరికి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ తలను ఓ చేత్తో.. కత్తిని ఓ చేత్తే పట్టుకుని నవ్వుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. ఆ అమానుష చర్యను కొందరు రికార్డ్ చేశారు. ఆ వీడియో తర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ భర్త చేసిన పనికి ఇరాన్ దేశంలో వ్యతిరేకతలు పెళ్లుబికాయి. అతడిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు పెరిగిపోయాయి.
ఇదీ చదవండి: కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రి!
ఆ ఘటనపై మహిళా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ ఎన్సీ ఖాజాలీ స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్ లో బాలికల వివాహ వయసు 13 ఏళ్లు కాగా.. మృతురాలికి 12 ఏళ్లకే వివాహం జరిగింది. తప్పు చేసిన భార్య తల నరికి తనేదో ఘనకార్యం చేసినట్లు రోడ్డుపైకి నవ్వుతూ వచ్చాడు. అంటే భార్య లేచిపోవడంతో పోయిన తన పరువు ఆమె తల నరకడంతో వెనక్కు వచ్చిందని భావించి ఉండచ్చు. కంటికి కనిపించని పరువు అనే పదం కోసం పాకులాడుతూ ఇలాంటి ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.