ఈరోజుల్లో సమస్య ఏదైనా.. ఆత్మహత్య మాత్రం సొల్యూషన్ గా కనిపిస్తోంది. ఎంతో మంది యువత.. పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, నిరుద్యోగం, ప్రేమ వైఫల్యం ఇలా కారణం ఏదైనా కూడా.. ఆత్మహత్యే దారి అని భావిస్తున్నారు. కన్న వాళ్ల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడి కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కు చెందిన స్మృతిరేఖా ఫరీదా(26) హైదరాబాద్ గౌలిదొడ్డి సాయినధన్ పీజీ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటోంది. సోమవారం ఉదయం కొలీగ్ కు ఫోన్ చేసి ‘నాకు బతకాలి అని లేదు’ అని చెప్పి ఉరేసుకుంది. స్నేహితుల సమాచారంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు విషయం చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫరీదా ఎందుకు ఆత్మహత్యకు పాల్పిండింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: ఆ ప్రియురాలికి కోపం వచ్చింది! ఊర కొట్టుడు!