వివాహేతర సంబంధాల్లో వేలు పెట్టిన కొందరు భార్యభర్తల కాపురాలు ఎటు కాకుండా పోతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో తలదూర్చుతూ పచ్చని సంసారాన్ని నిట్టనిలువునా చీల్చుకుంటున్నారు. ఇదే దారిలో అడుగులు వేసిన ఓ భర్త.. తన వివాహేతర బంధాన్నికి భార్య అడ్డుగా ఉందని కన్న పిల్లల ముందే దారుణంగా చంపేశాడు. ఈఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా శ్రీ రంగపట్నం తాలుకలోని ఓ గ్రామానికి చెందిన రవిగౌడ, యోగిత భార్య భర్తలు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు ఓ పాప, బాబు ఉన్నారు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం హాయిగా సాగింది. కొన్నాళ్లకు రవిగౌడ్ భార్య యోగితపై ఆనాసక్తి చూపిస్తూ పొరుగు ఊరికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. రవి గౌడ రాసలీలల గురించి ఆయన భార్య యోగితకు తెలిసింది. ఈ పరిణామంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
అయినప్పటికి రవిగౌడ్ తన వివాహేత సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆ మహిళతో రవిగౌడ్ ఉండగా యోగిత రెడ్ హ్యాండెండ్ గా పట్టించింది. పెద్ద మనుషులు దగ్గర పంచాయితీ పెట్టింది యోగిత. ఈ క్రమంలో పెద్దలు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చారు. కొన్నాళ్లు భార్యతో బాగానే ఉన్న రవికీ మళ్లీ అదే మహిళతో వివాహేతర సంబంధం తిరిగి కొనసాగించాడు. అంతటితో ఆగకుండా భార్య యోగితను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఓ రోజు ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. యోగితాను ఇంట్లోకి ఈడ్చుకెళ్లిన రవిగౌడ వైర్‌ను ఆమె గొంతుకు బిగించి చంపేశాడు.
కన్నబిడ్డల కళ్ల ముందే ఈ ఘోరం జరిగింది. కళ్ల ముందు జరిగిన దారుణంతో ఆ పిల్లలు భయంతో హడలిపోయారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని పిల్లలను బెదిరించి రవిగౌడ అక్కడ నుంచి పారిపోయాడు.అతనిని అరెస్ట్ చేసి తమ కూతురిని అతను చంపినట్టుగానే అతనినీ చంపేయాలని యోగిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.