నేటికాలంలో కొందరు ఆడవాళ్ల ప్రవర్తనలు దారుణంగా ఉంటున్నాయి. భర్త తన మాటే విన్నాలనే ధోరణిలో కొందరు మహిళలు వింతగా ప్రవర్తిస్తుంటారు. చిన్నచిన్న విషయాలకు భర్తలో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో దారుణమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. తాము చెప్పిన మాట వినకపోతే ఇంట్లో వారిని చంపడానికైన, తాము చావడానికైన సిద్ధపడుతున్నారు. తాజాగా ఓ మహిళ అలాంటి దారుణానికే ఒడిగట్టింది. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్న భర్త.. తన చెప్పిన మాట వినలేదని..ఇద్దరి పిల్లలతో సహా కలసి రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈదారుణమైన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
గుజరాత్ లోని సూరత్ జిల్లాలోని సోథియా గ్రామంలో ఓ జంటకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడేళ్లు, ఐదేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యను, పిల్లలను ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు సదరు భర్త. అలా ఆమె ఏమి కోరిన తెచ్చి ఇస్తుండే వాడు. కొన్ని విషయాల్లో మాత్రం వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరుతుండేవి. అవి కూడా టీ కప్పులో తుఫాన్ లానే ఉండేది. ఇలా సాగుతున్న వారి సంసారంలో ఓ పెళ్లి వేడుకు విషాదం నింపింది. తన పుట్టింటిలో పెళ్లి వేడుకు జరుగుతున్నట్లు సదరు ఆ మహిళకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో తన పుట్టింటి పెళ్లికి వెళ్తానని భర్తను అడిగింది. దీనికి ఆ భర్త అంగీకరించలేదు. అత్తింటి వారు కూడా ఎవరు దీనికి ఒప్పుకోలేదు. దీంతో ఆ మహిళ తన విచక్షణ కోల్పోయింది.
అత్తింటి వారిపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపింది. వారి గ్రామానికి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ దగ్గరికి చేరుకుంది. కొద్ది సేపు అక్కడే గడిపిన సదరు మహిళ.. వేగంగా వస్తున్న రైలు ముందు పిల్లలతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఎంత సేపటికి భార్య ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పట్టాలపై విగత జీవులుగా పడి ఉన్న ఆ ముగ్గురు మృతదేహాలు చూసి గుండెలు పగిలేలా రోదించాడు ఆమె భర్త. చూశారు కదా.. క్షణికావేశంలో ఓ మహిళ తీసుకున్న నిర్ణయం.. ఆమెతో పాటు అభంశుభం తెలియని ఇద్దరు పసివాళ్ల ప్రాణాలు బలయ్యాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.