Tirumala: తిరుమలలో దారుణం చోటుచేసుకుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ భక్తున్ని మరో భక్తుడు హత్య చేశాడు. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న గోవింద నిలయం దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న శ్రీవారి ఆలయం వెనుక ఉన్న గోవింద నిలయం దగ్గర ఓ మృతదేహం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు హత్య మ్యూజియం దగ్గర అర్థరాత్రి జరిగినట్లు గుర్తించారు. ఓ వ్యక్తి అక్కడ నేలపై నిద్రపోతున్న మరో వ్యక్తి తలను బండరాయితో కొట్టి చంపినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా 2 గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మృతుడ్ని తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా.. నిందితుడ్ని శరవణగా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాల కోసం నిందితుడ్ని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య.. తల నరికి పోలీస్ స్టేషన్ లో లొంగుబాటు!