చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తల మధ్య గొడవలు చినిగి చినిగి గాలి వానలా తయారవుతున్నాయి. సర్దుకుపోవాల్సింది పోయి క్షణికావేశంలో హత్యలు, లేదంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత అరటి పండు కోసం ఏకంగా భర్తనే హత్య చేసింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని తిరుచ్చిలో సుబ్బారావుపురం ప్రాంతం.
ఇదే గ్రామానికి చెందిన దినేష్ రాజశేఖరన్, లావణ్యా అనే యువతిని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొంత కాలం బాగానే సాగిన వీరి దాంపత్య జీవితం రోజులు గడిచే కొద్ది గొడవలు వచ్చి చేరాయి. ఇక దీనికి తోడుగా భర్త తాగుడుకు బానిసై భార్య లావాణ్యని రోజు వేధింపులకు గురి చేసేవాడు. ఇంతటితో ఆగకుండా అనుమానంతో నరకం చూపించేవాడు.
ఇది కూడా చదవండి: Karnataka: తెల్లారితే పెళ్లి.. కట్ చేస్తే వధువు ఇచ్చిన ట్విస్ట్ కు దిమ్మ తిరిగింది!
ఇక కొన్నాళ్లు సర్దుకుపోదామనుకున్నా.. భర్త తీరులో ఎలాంటి మార్పులు రాలేదు. ఇక వీరిద్దరి మధ్య నలుగుతున్న వివాదాలను పరిష్కారం కోసమని పంచాయితి పెట్టించినా దీనికి పెద్దలు కూడా సహకరించకపోవడం విశేషం. ఇలా వీరి కాపురంలో రోజుకొక చిచ్చు రగిలి వివాదాలు ముదిరిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల భర్తను భార్య అరటి పండ్లు తేవాలంటూ చెప్పింది. భార్య మాట వినని దినేష్ అరటి పండ్లు తీసుకురాకుండా వచ్చాడు.
దీంతో భార్య కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.ఈ కారణంతోనే ఇద్దరి మధ్య మరోసారి గొడవ రాజుకుంది. ఇక ఇన్నాళ్లు భరించిన భార్యలావణ్య తట్టుకోలేకకపోయింది. అక్కడే ఉన్న కత్తి తీసుకుని భర్తను పొడిచింది. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన భర్తను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడంటూ వైద్యులు తెలిపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.