తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రామేశ్వరంలోని వడకాడు గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళకు గతంలో వివాహం జరిగింది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వడకాడు మత్స్యకార గ్రామంలో మంగళవారం ఉదయం ఆ మహిళ చేపల కోసం వెళ్తుండేది.
ఇక్కడే పనిచేస్తున్న కొందరు వలస కార్మికులు ఆ మహిళపై అనేక సార్లు వేధింపులకు గురి చేశారు. ఈ విషయం భర్త వరకు చేరడంతో ఓ సారి వారిని మందలించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ దుర్మార్గుల ఆలోచన మాత్రం అస్సలు చావలేదు. అయితే మంగళవారం మరోసారి ఆ మహిళ వడకాడు మత్స్యకార గ్రామానికి చేపల కోసం వెళ్లింది. కాపుకాచుకుని ఉన్న ఆరుగురు వలస కార్మికులు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Odisha: పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.. ఒప్పుకోలేదని చెట్టుకు ఉరేసుకున్నారు!
ఇక ఇంతటితో ఆగకుండా అనంతరం ఆమె చీరను మెడకు బిగించి హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇక రాత్రి అయినా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త కంగారుపడ్డాడు. అటు ఇటు అంతా వెతికాడు. అయినా భార్య జాడ మాత్రం దొరకలేదు. దీంతో వెంటనే భయంతో భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఇంతలోనే గ్రామంలో ఉన్న రొయ్యల ఫామ్‌లో ఓ మహిళ మృతదేహం పాక్షికంగా కాలిపోయి పడి ఉందని సమాచారం అందింది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అది బాధితురాలి మృతదేహం అని తేల్చారు. ఇక అనంతరం ఎట్టకేలకు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తుననారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.