మనిషి చనిపోయిన అనంతరం ఏం జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం ఏ ఒక్కరికి కూడా తెలియదు. పురాణాలు, గ్రంధాల ప్రకారం పాపాలు చేసినవాడు నరకానికి వెళ్తాడని, పుణ్యాలు చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడని అందరూ అనుకుంటుంటారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం సైంటిఫిక్ గా ఇంకా రుజువు కాలేదు. ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నకు వెతికిపట్టేందుకు ఓ యువకుడు ఎవరూ చేయని సాహసం చేసి భూమి మీద లేకుండా పోయాడు.
వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ అనే యువకుడు తరమణిలో ఉన్న లా కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు.
కూడా ఇది చదవండి: Tandur: పుట్టింటికి వెళ్తానన్న భార్య.. నిజమేనని నమ్మిన భర్తకు ఊహించని షాక్!
స్థానికంగా ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటున్న సల్మాన్ తన ఫ్రెండ్స్ తో పాటు కలిసి ఉండేవాడు. అయితే సల్మాన్ మాత్రం సమాధానం దొరకని ప్రశ్న కోసం తీవ్రంగా ఆరాటపడ్డాడు. ఏకంగా మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇక సల్మాన్ అనుకన్నట్లుగానే.. ‘‘మరణం తర్వాత ఏం జరుగుతుంది? అని తెలుసుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను దాచిన రూ.5వేల నగదును అమ్మకు అప్పగించండి’’ అని ఓ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇక సల్మాన్ గత కొన్ని రోజుల నుంచి సరిగ్గా ఎవరితోనూ మాట్లాడడం లేదని, ఏం జరిగిందని తెలుసుకునేందుకు తన ఫ్రెండ్స్ హాస్టల్ ఉంటున్న తన గదిలోకి వెళ్లి చూసే సరికి సల్మాన్ ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా ఉన్నాడు. వెంటనే తన ఫ్రెండ్స్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.