crime news: తనను, పిల్లల్ని వదిలేసి వేరే యువతితో వేరు కాపురం పెట్టిన భర్తకు గుణపాఠం చెప్పిందో భార్య. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యాపేటకు చెందిన భానుప్రకాశ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. గత కొద్దిరోజుల నుంచి భానుప్రకాశ్ ఇంటికి వెళ్లటం లేదు. అతడు వేరే యువతితో కాపురం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసిన భార్య ఆగ్రహంతో రగిలి పోయింది. కుటుంబసభ్యులతో కలిసి భర్త ఉంటున్న ఇంటికి వచ్చింది. వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది.
పట్టలేని ఆగ్రహంతో యువతి జుట్టు పట్టుకుని చావకొట్టింది. భర్తను సైతం బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అక్కడున్న జనం ఎంత విడిపించటానికి ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. కోపంతో భర్త, అతడి ప్రియురాలిపైకి సివంగిలాగా దూకి దాడి చేసింది. తన భర్త సదరు యువతిని రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడని ఆరోపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యాభర్తల్ని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : యువకుడితో ఒంటరి మహిళ ఎఫైర్..! అర్థరాత్రి ప్రియుడు ఇంటికొచ్చి దారుణం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.