Shahinath Gunj: బేగంబజార్ షాహినాథ్ గంజ్‌లో చోటుచేసుకున్న పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్‌కు తరలించారు. పోలీసులు వారినుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను చూసేందుకు మృతుడు నీరజ్ భార్య సంజన, మృతుడి తల్లిదండ్రులు ఇతర కుటుంబసభ్యులు వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్‌కు వెళుతున్నారు. నిందితులను తమకు చూపించాలని భాదిత కుటుంబం ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారి డిమాండ్‌ను అంగీకరించి, వారిని పోలీసు వాహనంలో డీసీపీ ఆఫీసుకు తీసుకెళుతున్నారు.
కాగా, హైదరాబాద్‌కు చెందిన నీరజ్, సంజన ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావటంతో అమ్మాయి తరపు వారు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో అమ్మాయి కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు మూడు నెలల బాబు ఉన్నాడు. సంజన కులాంతర వివాహం చేసుకున్నందున ఆమె కుటుంబం పగతో రగిపోయింది. నీరజ్‌ను చంపటానికి సంజన సోదరులు పథకం వేశారు. శుక్రవారం తాత జగదీష్ పన్వర్‌తో కలిసి నీరజ్ స్కూటీపై వెళ్తుండగా కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా 15 సార్లు పొడిచి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు కర్ణాటకలోని గుడిమత్కల్ పారిపోయినట్లు గుర్తించారు.వారి కోసం అన్వేషణ ప్రారంభించి అరెస్ట్ చేశారు. మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు వారి స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. సంజన భర్త హత్యపై ఉదయం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు, సోదరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నీరజ్‌ను చంపిన వారిని ఉరి తీస్తేనే అతని ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే తన రెండు నెలల బాబు, అత్తామామలపై కూడా దాడి చేస్తారని అన్నారు. మరి, ఈ పరువు హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vijayawada: మద్యం మత్తులో తండ్రిని కొట్టి చంపిన కొడుకు!