Road Accident: కర్ణాకటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును ఢీకొట్టి బోల్తా పడ్డ ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగటంతో 8 మంది సజీవదహన అయ్యారు. గోవానుంచి హైదరాబాద్ వస్తుండగా శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. ఓ ప్రైవేట్ బస్సు 35 మందితో గోవానుంచి హైదరాబాద్ బయలు దేరింది. శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కలబుర్గి జిల్లాలోని కమలాపుర టౌన్ బయట ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును ఢీకొట్టి బోల్తా పడింది. ఆ వెంటనే బస్సులో మంటల చెలరేగాయి.
ఈ మంటల్లో కాలి 8 మంది దాకా సజీవ దహనం అయ్యారు. మరి కొంతమంది గాయాలతో మంటలనుంచి బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కలబుర్గిలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Peddapalli: అన్నం పెడతానని తీసుకెళ్లి.. తొమ్మిదేళ్ల బాలికపై 44ఏళ్ల వ్యక్తి అత్యాచారం!