ఇద్దరు యువకులు ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఒకరిపై ఒకరికి తొలుత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం రాను రాను స్నేహంగా మారి చివరికి వాళ్లిందరూ ప్రేమలో పడ్డారు. అంతటితో ఆగారా అంటే అదీ లేదు. చివరికి పెళ్లి చేసుకున్నారు. కానీ చివరికి వారిద్దరి ప్రయత్నం బెడిసికొట్టి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన రవి, అర్జున్ ఇద్దరు ఒకే దగ్గర పని చేస్తున్నారు. ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగడంతో ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించి రవి అనే యువకుడుట్రాన్స్ జెండర్ గా మారి రియాగా పేరు మార్చుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యుల ఇష్టం మేరకు ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కొన్నాళ్లపాటు వీరిద్దరూ సంతోషంగానే జీవితాన్ని గడిపారు. కానీ రాను రాను వీరిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి అర్జున్ రియాను పక్కకు పెట్టడం మొదలు పెట్టాడు.
ఇది కూడా చదవండి: పక్కింటి యువకుడితో పిల్లల తల్లి ప్రేమాయణం.. భర్త లేని సమయం చూసి!
దీంతో అర్జున్ ప్రవర్తనను గమనించిన రియా తట్టుకోలేకపోయింది. ఇక కొంతకాలానికి అర్జున్ రియాను పూర్తిక దూరంపెట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియక రియా పోలీసులను ఆశ్రయించింది. తనకు అర్జున్ తో ఉండాలనుందని, ఎలాగైన నాకు న్యాయం చేయాలంటూ రియా పోలీసులను వేడుకుంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.