crime news : బాలికతో ఎఫైర్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇద్దరి సంబంధం నచ్చని ఆమె కుటుంబసభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణెకు చెందిన ప్రద్యుమ్న్ అనే 22 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన బాలికతో ఎఫైర్ నడుపుతున్నాడు. ఇది బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దూరంగా ఉండాలని యువకుడిని హెచ్చరించారు. అయితే, వారి మాటలను పట్టించుకోలేదు. బాలికతో ఎఫైర్ కొనసాగించాడు. దీంతో బాలిక కుటుంబం అతడిపై కక్ష కట్టింది.
అతడ్ని అడ్డుతొలగించుకుంటే మంచిదని భావించారు. మార్చి 16వ తేదీ అతడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 12 గంటల్లోనే కేసును ఛేధించారు. బాలిక తల్లీదండ్రి, సోదరుడు, ఫ్యామిలీ ఫ్రెండ్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో వారిని హాజరు పరిచారు. కోర్టు మార్చి 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఘటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : విషాదం: పెద్దలు ప్రేమ వద్దన్నారని..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.