సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగానే రోజు రోజుకు దారుణాలు ఎక్కువైపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధాలకు సై అంటున్నారు. తీరా ఈ విషయం బయటపడడంతో హత్య చేయడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని పరాయివాడితో అక్రమ సంబంధాన్ని నడిపించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్య ప్రియుడిని దారుణంగా హతమర్చాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నిజామాబాద్ జిల్లా పెద్దకొడప్‌గల్ మండలంలోని కాస్లాబాద్ ప్రాంతం. ఓ పెళ్లైన మహిళ ఇదే ప్రాంతానికి చెందిన కేతావత్ రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ ఉంది. ఇలా భర్తకు తెలియకుండా భార్య సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో గడిపేది. అయితే ఇటీవల భర్తలేని సమయంలో భార్య ప్రియుడైన కేతావత్ రాజుని ఇంట్లో రప్పించుకుంది. ఇంతటితో ఆగకుండా శారీరక కోరికలు కూడా తీర్చుకుంది. తీరా వాళ్లిద్దరు ఇంట్లో ఉండగానే సడెన్ గా ఆ మహిళ భర్త ఎంట్రీ ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: Siddipet: పెళ్లైన నెలకే భార్య దారుణం.. ప్రియుడిని దక్కించుకునేందుకు భర్తను హత్య చేసింది!
దీంతో ఈ సీన్ ను చూసి జీర్ణించుకోలేకపోయిన భర్త భార్య ప్రియుడిపై కోపం పెంచుకుని దారుణానికి పాల్పడ్డాడు. రాజు మెడపై కాలుతో తొక్కి, వైర్ తాడుతో ఉరి వేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బాత్‌రూంలో పెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.