నల్లగొండ జిల్లాలోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఫోజులకు పోయి పెళ్లికొడుకు తన బరాత్ లో ఓ యువకుడి నిండు ప్రాణాన్ని తీశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఏం జరిగిందంటే? అది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం గట్టుప్పల గ్రామం. ఇదే గ్రామానికి చెందిన మల్లేష్ పెళ్లి వేడుక బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా జరిగింది.
ఇక ఈ శుభకార్యానికి బంధువులంతా వచ్చి వరుడు, వధువులను ఆశ్వీర్వదించారు. ఇక ఈ తంతులో భాగంగానే అక్కడ పెళ్లిలో చేయాల్సిన కార్యక్రమాలు అన్ని పూర్తి చేశారు. ఇక పెళ్లి అన్నప్పుడు వధువుని వరుడి స్వగ్రామానికి తీసుకొచ్చే క్రమంలో బరాత్ ను ఏర్పాటు చేసుకుంటారు. ఇక వరుడు మల్లేష్ కూడా తన ఫ్రెండ్స్ ను పిలిపించుకుని బరాత్ ను ఘనంగా ప్రారంభించాడు. ఇందులో భాగంగా బరాత్ లో తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: పెళ్లి లో ఊడిన వరుడి ప్యాంట్.. పగలబడి నవ్విన వధువు!ఇక తన ఇంటికి సమీపంలోనే వరుడు మల్లేష్ కూడా కారు దిగి ఫ్రెండ్స్ తో పాటు కొద్దిసేపు డ్యాన్స్ చేసి మళ్లీ కారు ఎక్కి కూర్చున్నాడు. ఇక అతను రాగనే ఆ కారు డ్రైవర్ కారు దిగి పక్కకు వెళ్లాడు. దీంతో వెంటనే వరుడు మల్లేష్ వధువు ముందు ఫోజులు కొట్టబోయాడు. ఈ క్రమంలోనే వరుడు మల్లేష్ డ్రైవర్ సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. ఇక ఇంతటితో ఆగకుండా తనకు డ్రైవింగ్ రాదన్న విషయం తెలిసినా కూడా కారును ముందుకు తీయబోయాడు. వెంటనే కారు డ్యాన్స్ చేస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఏం జరిగిందని అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఆ షాక్ కు నుంచి తేలుకోకముందే కారు చక్రాల కింద పడి సాయిచరణ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు మల్లేష్ తో పాటు సురేష్, గౌతమ్, ఆనంద్ అనే యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన సాయిచరణ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఫోజులకు పోయి ఓ యువకుడి నిండు ప్రాణాన్ని తీసిన పెళ్లి కొడుకు మల్లేష్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.