మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాపింగ్ కోసమని బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అడవిలో కుళ్లిపోయిన శవాలుగా తేలారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి మండలం వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మ , భిక్షపతి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి చేయగా చిన్నకూమార్తే సంతోషి తల్లిదండ్రుల వద్దే ఉంటూ కూలీ పనులు చేస్తూ ఉండేది. అయితే కొడుకు ఓ దొంగతనం కేసులో ఆరు నెలల క్రితం రైలు పట్టాలపై సూసైడ్ చేసుకున్నాడు.
కాగా ఈనెల 10వ తేదిన యాదమ్మ, ఆమె చిన్నకుమార్తె సంతోషి షాపింగ్ కోసమని ఇద్దరు బయటకు వెళ్లారు. అర్ధరాత్రి గడిచిన ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారు పడ్డ భర్త అటు ఇటు అంతా వెతికాడు. ఎంతకు వారి జాడ కనిపించలేదు. బిక్షపతి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చేగుంట మండలం వడియారం అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో రెండు శవాలు ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ప్రియుడిని మరిచిపోలేని భార్య.. చివరగా భర్త ఓ మాట చెప్పాడు!
ఇక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతదేహాలు యాదమ్మ ,సంతోషి అని తేల్చారు. ఈ విషయం భర్తకు సమాచారం ఇవ్వడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇక ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.