మెగాస్టార్ చిరంజీవి నటించిన పున్నమినాగు సినిమా గుర్తుంది కదా..? పాముల నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో ఎన్నిసార్లు పాము కాటుకు గురైనా చిరంజీవికి ఏమీ కాదు. కారణం..అది సినిమానే. కానీ నిజ జీవితంలో అలాంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏకంగా 500 సార్లు పాము కాటుకు గురైనా బతికే ఉన్నాడు. అతని కథలో ఆశ్చర్యాలతో పాటు విషాదమూ ఉంది. అతడు అన్ని సార్లు పాము కాటుకు గురికావడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలో గల ఔసా అనే పట్టణానికి చెందిన వ్యక్తి అనిల్ తుకారామ్ గైక్వాడ్. అతడు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పొలంలో పనులు చేస్తుండగా మొదటి సారి గైక్వాడ్ పాముకాటుకు గురయ్యాడు. ఇక అప్పటి నుంచి గడిచిన 15 ఏళ్లలో సుమారు 500 సార్లు పాము కాటుకు గురయ్యాడు. పాముకాటు కారణంగా చాలా సార్లు పరిస్థితి విషమించి చావు అంచులదాకా వెళ్లొచ్చాడు. అనిల్ గైక్వాడ్ పాము కాటుకు గురైన ప్రతిసారి కుటుంబీకులు భారీగా ఖర్చు చేసి అతనికి చికిత్స అందించి బతికించుకుంటున్నారు.పొలం పనులు చేస్తున్న సమయాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో జనం మధ్య సంచరించే సమయంలో కూడా అతను పాము కాట్లకు గురయ్యాడు.
అయితే.. 15 ఏళ్లపాటు దాదాపు 500 సార్లు పాము కాటుకు గురైన అనిల్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ పాములు పగపట్టినట్లుగా ఇతణ్నే ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావట్లేదని కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. అనిల్‌కు 150 సార్లకుపైగా వైద్యం చేసిన డాక్టర్ రణవేది కూడా ఇదే మాట చెబుతున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన అనిల్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు కుటుంబీకులు. మరి.. ఓ మనిషిని పాము ఇన్ని సార్లు కాటు వేయడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.