మహారాష్ట్రలో ఓ యువకుడు పోలీసులకు చుక్కలు చూపించాడు. ఏకంగా పెట్రోలింగ్ వాహనం ఎక్కి హల్చల్ చేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా పట్టుకోబోయిన పోలీసులను సైతం కొరికి నానా హంగామ చేశాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహారాష్ట్రలోని థానే జిల్లా నౌపడ ప్రాంతం. గురువారం అర్థరాత్రి 12:30 గంటల ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓ చోట కొంతమంది అల్లరి చేస్తుండడంతో ఏం జరిగిందని తెలుసుకునేందుకు పోలీసులు అక్కడికెళ్లి పరిశీలించారు.
ఇది కూడా చదవండి: Vikarabad: రెండు బీర్లు కావాలి అంటూ అర్ధరాత్రి డయల్ 100కి ఫోన్ చేసిన యువకుడు!
ఏం జరిగిందంటూ అక్కడున్న యువకులను అడిగేలోపే లోపలి నుంచి ఓ యువకుడు తోసుకుంటూ వచ్చి పోలీసులను దూషించాడు. ఇక ఇంతటితో ఆగలేదు. పెట్రోలింగ్ వాహనం ఎక్క నానా హంగామ చేశాడు. దీంతో పట్టుకోబోయిన పోలీసుల చేతులను సైతం కొరికి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇక ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.