Magician: ఆర్కే సామ్రాట్ స్టేజి మీదకు ఎక్కి మ్యాజిక్ చేస్తుంటే.. అక్కడి జనం అది చూసి తెగ చప్పట్లు కొడుతున్నారు. అతడు ఒక్కో ఐటం చేస్తుంటే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి స్టేజిమీద ఉన్న సామ్రాట్ దగ్గరకు వెళ్లాడు. అతడ్ని గట్టిగా పట్టుకుని ‘యు ఆర్ అండర్ అరెస్ట్!’ అన్నాడు. ఇంతలో మరో వ్యక్తి స్టేజిమీదకు వచ్చాడు. రాజాను పట్టుకుని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. ఇంతకీ ఆ వచ్చింది ఎవరు? ఆ మెజీషియన్‌ను ఎందుకు తీసుకెళ్లిపోయారు?.. ఇవి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేసేయండి… మధ్య ప్రదేశ్, కంద్వా జిల్లాలోని సుర్‌గావ్‌కు చెందిన నానక్ రామ్ రామేశ్వర్ గావ్లీ అలియాస్ రాజా 2007లో 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి పేరుతో మోసం చేశాడు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. అదే సంవత్సరంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. 2012లో రాజాకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాతినుంచి అతడు కనిపించకుండా పోయాడు. పోలీసులు అప్పటినుంచి రాజా కోసం వెతుకుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజా బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లాలో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. మెజీషియన్‌గా వేషం మార్చుకుని, ఆర్కే సామ్రాట్‌గా పేరు కూడా మార్చుకుని తిరుగుతున్నాడని తెలుసుకున్నారు.
వెంటనే బిహార్ వెళ్లారు. అతడు షో చేస్తున్న బాంజా గ్రామానికి మఫ్తీలో వెళ్లి, ప్రేక్షకుల్లా కూర్చున్నారు. షో ముగుస్తుందన్న సమయానికి పైకి వెళ్లి అతడ్ని అరెస్ట్ చేశారు. మంగళవారం రాజాను కోర్టులో హాజరుపర్చి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘సర్కారు వారి పాట’ OTT రిలీజ్ ఖరారు!