ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకుని విడిచి ఉండలేనంతగా తయారయ్యారు. అయితే ఇటీవల ప్రియురాలిని కలిసేందుకు వారి ఇంటిముందుకెళ్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలా యువకుడికి ఏమైంది? ప్రియురాలి ఇంటి ముందు అకస్మాత్తుగా ఎలా మరణించాడు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ పరిధిలోని చిరాయ్ గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన శ్రీరామ్.. దుగ్‌సర గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. విడిచి ఉండలేనంతగా మారిపోయారు. అయితే ఇటీవల తన ప్రియురాలిని కలిసేందుకు వారి ఇంటిముందుకొచ్చాడు. ఇంట్లోకి వెళ్లాలని భావించి గుమ్మం వరకు వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందని తెలుసుకునే లోపే వాంతులు చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: అన్నాచెల్లెళ్లు అనే మాటే మర్చిపోయారు.. అర్ధరాత్రి ఎవరులేని చోటుకు వెళ్లి!దీంతో భయపడిన స్థానికులు 100 కి కాల్ చేశారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీరామ్ ని ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో శ్రీరామ్ ఆస్పత్రిలో మరణించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టంకి తరలించారు. అసలు శ్రీరామ్ మరణానికి కారణం ఏంటి? ప్రేమ వ్యవహారమే కారణం కావచ్చా? అనే కోణంపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.