crime news : కంటి పాపలా చూసుకుంటున్న కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తికి దారుణమైన శిక్ష విధించాడో తండ్రి. అతడ్ని చంపి, ముక్కలుగా కోసి పడేశాడు. అనంతరం వాటిని మూటలో కుక్కి నదిలో పడేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్, ఖంద్వ జిల్లా శక్తపుర్ గ్రామానికి చెందిన త్రిలోక్ నాథ్(55) అదే ప్రాంతానికి చెందిన బంధువు కూతురు 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక తండ్రి అతడిపై కక్ష గట్టాడు. కూతురిపై అత్యాచారం చేసిన వాడ్ని ఎలాగైనా చంపి పగ తీర్చుకోవాలనుకున్నాడు. శనివారం బాలిక తండ్రి, మేనమామ కలిసి త్రిలోక్ నాథ్‌ను బైక్‌పై అజనల్ నది దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ అతడిపై దాడి చేసి చంపేశారు. అనంతరం తలను శరీరం నుంచి వేరుచేశారు. శరీరాన్ని కూడా చేపలు కోసే కత్తితో రెండు భాగాలుగా చేశారు. దాన్ని ఓ గోనె సంచిలో కుక్కి మూతకట్టారు.
గోనె సంచిని పక్కనే ఉన్న నదిలో పడేశారు. ఆ గోనె సంచి నీళ్లలో కొట్టుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో కట్టు ఊడిపోయింది. శరీర భాగాలు బయటకు వచ్చేశాయి. అవి నీటిపై తేలుతూ 40 కిలో మీటర్లు ప్రయాణించాయి. వాటిని జనం ఫొటోలు తీశారు. అవి కాస్తా సోషల్‌మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి. దీంతో చనిపోయింది త్రిలోక్ నాథ్ అన్న సంగతి వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్రిలోక్ నాథ్ బాలికను రేప్ చేశాడని తెలియ వచ్చింది. ఆ కోణంలో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరి హస్తమైనా ఉందా? అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి.. ఏడాది కాకముందే విషాదం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.