అందివచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరస్తులు. ఏమ్రాతం అలసత్వంగా ఉన్నా లక్షలు పోగొట్టుకోకతప్పదు. తాజాగా నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్ ని బుట్టలో వేసుకున్న సైబర్ నేరగాళ్లు పది లక్షల వరకు గుంజారు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్ సొంతగా హాస్పిటల్ నడుపుతున్నాడు. నిత్యం పేషెంట్లతో బిజీగా గడిపే ఈ డాక్టర్ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేసేవాడు. అదే సమయంలో ఎక్కువగా యువతుల కోసం సెర్చ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఓ డేయింగ్ సైట్ కు లాగిన్ అయ్యాడు. ఆ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. వెంటనే యువతితో చాటింగ్ మొదలెట్టాడు. ఇంతలోనే ఇద్దరి మధ్య లైంగిక విషయాలపై చర్చ సాగింది.
ఇది కూడా చదవండి : వాట్సప్ ద్వారా యువతి పరిచయం! నగ్నచిత్రాలను పంపి..
ఇలా సాగిన చాటింగ్ కాస్తా వీడియో కాల్ గా మారి, ఆ తర్వాత సెమీ న్యూడ్ వీడియో కాల్.. న్యూడ్ వీడియో కాల్ వరకు వెళ్ళింది. మొదట అతడితో మత్తుగా మాట్లాడిన యువతి.. డాక్టర్ ను కూడాబట్టలు విప్పమని చెప్పింది. అడిగింది అమ్మాయి కదా మనోడు రెచ్చిపోయి చెప్పినట్లే చేశాడు. దీంతో యువతి సదరు వీడియోలను రికార్డ్ చేసింది. అలా పలుమార్లు న్యూడ్ కాల్ మాట్లాడిన తర్వాత ఆ యువతి నుంచి ఫేస్ బుక్ ద్వారా వీడియో మెసేజ్ వచ్చింది.
వీడియో చూసి షాక్ అయిన డాక్టర్ ఎందుకు రికార్డ్ చేశావని ప్రశ్నించగా.. తనకు వెంటనే రెండు లక్షలు ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలుపెట్టింది. ఇలా అతడి వద్ద నుంచి రూ.10 లక్షలక పైగా సొమ్మును కాజేసింది. అయినా ఆశ తీరని యువతీ మళ్లీ డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేయడంతో చేసేదిలేక పోలీసులను ఆశ్రయించాడు డాక్టర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.