ఈ మధ్యకాలంలో యువత ప్రేమ పేరుతో దేనికైనా తెగిస్తున్నారు. కొందరైతే ప్రియురాలి కోసం అడ్డొచ్చిన వారిని అంతమొందించడానికి కూడా వెనకాడని పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఇక ప్రేమించాలని అమ్మాయిల వెంటపడటం, కాదంటే హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం ఒకే అమ్మాయిపై ఇద్దరు యువకులు మనసుపడ్డారు.
దీంతో ఇద్దరిలో ఒకరమే ఉండాలని శపధం చేసుకుని చివరికి ఓ యువకుడి దాడిలో మరో యువకుడు ప్రాణాలు విడిచిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక విషయం ఏంటంటే? అది కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతం. గత కొన్ని రోజుల నుంచి ఒకే అమ్మాయిపై ఇద్దరు యువకులు మనసుపడ్డారు. దీంతో ఇదే విషయంపై ఒకరిపై ఒకరు పగ పెంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Kukatpally: పెళ్లి కావట్లేదని మనస్థాపంతో యువతి బలవన్మరణం!
ఆ అమ్మాయిని నేనే ప్రేమించాలి తప్పా నీవు కాదని ఎవరికి వారు మనసులో బలంగా అనుకున్నారు. ఇక ఓ రోజు ఏకంగా ఘర్షణకే దిగారు. ఇలా అయితే కాదని భావించిన ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ అమ్మాయి దక్కాలంటే ఇద్దరిలో ఒకరమే ఉండాలంటూ ఇద్దరూ శపధం చేసుకున్నారు. దీంతో ఘర్షణకు దిగి ఓ యువకుడు బీర్ బాటిల్ పగలగొట్టి మరో యువకుడి గొంతులో పొడిచి హత్యచేశాడు. ఈ దాడిలో ఆ యువకుడు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
వెంటనే స్పందించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే ఆ యువకుడు మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.