అది కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారి పాలెం. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తితో మహిళకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. వీరి సంసారంలో ఎలాంటి గొడవలు లేకుండా అందమైన కాపురంలో వర్ధిల్లుతుంది. అయితే మహిళ భర్త మానసిక రోగి కావడంతో పెళ్లైన కొన్ని రోజుల తర్వాత భర్తను కాదని భార్య పక్కచూపులు చూసింది. ఇందులో భాగంగానే ఆ మహిళ స్థానికంగా యకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.
కొంత కాలం పాటు ఆ మహిళ భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేసింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దిరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఆ మహిళ శ్రీనివాస్ రెడ్డి కంటే ముందుగానే అదే గ్రామానికి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో కూడా వివాహేతర సంబంధాన్ని నడిపించింది. శ్రీనివాస్ రెడ్డితో మరస్పర్ధలు రావడంతో మళ్లీ ఆ మహిళ శ్రీకాంత్ రెడ్డికి దగ్గరైంది. దీంతో ఇద్దరు మళ్లీ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆ మహిళ ఇద్దరు ప్రియుళ్లు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రియురాలి ఇంటికి వచ్చారు.
వీరి రాకను గమనించిన ఆ వివాహిత ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఒకరిని చూసి మరొకరు నువ్వు ఎందుకు వచ్చాంటే నువ్వెందుకు వచ్చావంటూ తలబడ్డారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మధ్య మాటల దాడి పెరిగింది. ఇక కోపంతో ఊగిపోయిన శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై రోకలి బండతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కాల్పోయాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం వివాహేతర సంబంధం కారణంగానే శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ ఇద్దరూ కూడా భర్త స్నేహితులే కావడం విశేషం. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.