ప్రియుడికి లక్ష ఇచ్చి కోడలు ఫామ్ హౌస్ లో అడుగు పెట్టింది. ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి వెళ్లిందేమో అనుకుంటే పొరపాటే. కానీ కోడలు వెళ్లింది ప్రియుడితో కోరికలు తీర్చుకోవడానికి కాదు. మామను చంపడానికి. మీరు విన్నది నిజమే. అసలు మామను చంపడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని రామనగర జిల్లాలోని బిడిది తాలుకాలోని బానందూరు. ఇదే గ్రామానికి చెందిన గంటప్ప (60) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. గంటప్ప పిల్లలు వివాహాలు చేసుకుని ఎవరిపాటికి వాళ్లు ఉంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న గంటప్ప భార్యతో పాటు ఫామ్ హౌస్ లో నివాసం ఉంటున్నాడు.
ఇక గంటప్ప మరో కుమారుడు నందీష్ కొన్ని సంవత్సరాల క్రితం చైత్రా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొడుకు నందీష్ చైత్రాను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వెళ్లడంతో గంటప్ప ఇద్దరిని మెడపట్టి బయటకు గెంటేశాడు. చైత్రాను అందరి ముందు అవమానించి నేను ప్రాణాలతో ఉండగా నా ఇంట్లో అడుగు పెట్టలేవని అప్పట్లోనే తేల్చి చెప్పాడు. దీంతో కొన్ని రోజుల పాటు నందీష్ తన భార్యతో పాటు మరో చోట నివాసం ఉన్నారు. అయితే అందరి ముందు కోడలు చైత్రాని అవమానించడంతో కోడలు మామపై కోపంతో రగిలిపోయింది. ఎలాగైన మామను చంపాలనే స్కెచ్ వేసింది.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: భార్యతో హనీమూన్ లో నీచానికి దిగిన భర్త.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇదిలా ఉంటే చైత్రాకు నందీష్ కంటే ముందే నవీన్ అనే యువకుడిని ప్రేమించింది. దీంతో అప్పటి నుంచి భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇక ప్రియుడితో మామను హత్య చేయాలని భావించి నవీన్ కు రూ. 1 లక్ష ఇచ్చి అన్ని వివరాలు చెప్పింది. దీనికి ప్రియుడు నవీన్ కూడా ఓకే అన్నాడు. అయితే ఫిబ్రవరి 25న ప్రియుడితో పాటు మామ నిద్రిస్తున్న ఫామ్ హౌస్ కు వెళ్లింది. అక్కడికి వెళ్లాక మామ నిద్రపోయే వరకు వెయిట్ చేశారు.
మామ నిద్రలోకి జారుకున్నారని తెలిశాక వెంటనే మామ నిద్రిస్తున్న గదిలోకి ప్రియుడితో పాటు వెళ్లింది. అనంతరం ప్రియుడితో కలిసి చైత్రా మామను దారుణంగా హత్య చేసింది. గంటప్ప మరణంపై అనుమానం వచ్చిన అతని కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసును విచారించిన పోలీసులు ఎట్టకేలకు మామను ప్రియుడితో పాటు కోడలే హత్య చేసిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు చైత్రాతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.